ETV Bharat / sports

ఆ రెండు రోజులు నరకం అనుభవించా.. అలా చేస్తే పెద్ద రిస్క్ చేసినట్లే: మ్యాక్స్​వెల్​

వచ్చే ఏడాది భారత్​ జరగబోయే సిరీస్​కు తాను దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు ఆస్ట్రేలియా స్టార్​ ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​. ఇటీవలే గాయపడిన తాను ఆ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశాలు లేవని పేర్కొన్నాడు.

Maxwell
క్రికెట్ గ్లెన్​ మాక్స్​వెల్​
author img

By

Published : Nov 22, 2022, 6:38 PM IST

కొద్ది రోజుల క్రితం గాయపడిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ తన ప్రస్తుత పరిస్థితిపై ​స్పందించాడు. వచ్చే ఏడాది ఫిభ్రవరి మార్చిలో రాబోయే భారత పర్యటనకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాడు. ఒకవేళ తనను ఎంపిక చేస్తే అది పెద్ద రిస్క్​ అవుతుందని పేర్కొన్నాడు.

"జట్టును ప్రకటించే సమయానికి నేను పూర్తిగా కోలుకోలేకపోవచ్చు. నేను పర్యటనకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నన్ను తీసుకుంటే బోర్డు పెద్ద రిస్క్​ చేసినట్లే. వారు నన్ను తీసుకుంటే పెద్ద రిస్క్ తీసుకోవలసి ఉంటుంది" అని మ్యాక్స్​వెల్​ పేర్కొన్నాడు.

ఇక తాను ఎలా గయపడ్డాడో వివరించాడు మ్యాక్స్​వెల్​​. "ఒక సారి మా స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాం. పార్టీ అంతా అయిపోయిన తర్వాత మిత్రులందరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అందరం నవ్వుకుంటున్నాం. ఈ క్రమంలోనే ఆట పట్టిస్తూ మా స్నేహితుడి వెనక పరిగెత్తాను. అక్కడ తడిగా ఉండడం వల్ల అందరం ఒకే సారి జారి పడిపోయాం. దురదృష్టవశాత్తు ఫ్రెండ్.. నా కాలు మీద పడిపోయాడు. ​నా పాదం కొంచెం ఇరుక్కుపోయింది. అప్పుడు చాలా నొప్పి పుట్టింది. గట్టిగా అరిచాను. దానికి మా ఫ్రెండ్స్​ జోక్​ చేస్తున్నావా? లేదా సీరియస్​గానేనా అని అడిగారు. నేను 50 నిమిషాలు నేలపైనే పడుకున్నాను. ఆ నొప్పి చాలా భాదాకరం. మొదట రెండు రోజుల పాటు నాకు నిద్ర పట్టలేదు. ఆ రెండు రోజులు చాలా నరకం చూశాను. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించే సమయానికి నేను కోలుకునే అవకాశాలు ఎక్కువగా లేవు. ఎందుకంటే నేను పూర్తిగా రికవకీ అవ్వలేను. జట్టులో నన్ను ఎంపిక చేయడం రిస్క్​తో కూడుకున్న పని" అని మాక్స్​వెల్​ వివరించాడు.

ఇదీ చదవండి: Ali Raza: గోల్​కీపర్​గా సఫాయి కార్మికుడు.. రక్తం కారుతున్నా డోం​ట్​ కేర్​..

దేశవాళీ లిస్ట్​ ఏ క్రికెట్​ వీళ్లు బ్యాట్​ పడితే పరుగులే పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.