Funny Bowling Action : క్రికెట్లో ఒక్కో బౌలర్‌కు ఒక్కో యాక్షన్ ఉంటుంది. లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా రాబట్టేందుకు డిస్టెన్స్ ఎక్కువగా తీసుకొని బౌలింగ్ చేసేవారు కొందరైతే.. టెక్నిక్‌తో డిఫరెంట్ యాక్షన్‌తో బంతి సంధించే వారు ఇంకొందరు. అలా ఇప్పటివరకు క్రికెట్లో లసిత్ మలింగ, శివిల్ కౌశిక్, సోహైల్ తన్వీర్ డిఫరెంట్ యాక్షన్‌తో బౌలింగ్ చేసేవారే. అయితే వీళ్లను మించిన బౌలింగ్ యాక్షన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే లోకల్ క్లబ్ మ్యాచ్ ఆడుతున్న ఓ స్పిన్నర్.. వింతగా బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ స్టైల్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటివరకు క్రికెట్లో ఎవరూ చేయని విధంగా రెండు చేతులు తిప్పుకుంటూ.. బౌలింగ్ చేస్తూ బ్యాటర్‌ను తికమక పెడుతున్నాడు. ఆ బౌలర్ తన యాక్షన్‌తో బౌలింగ్ చేస్తే.. కన్య్ఫూజన్‌లో బ్యాటర్ క్రీజులో నుంచి తప్పుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అతడి బౌలింగ్ యాక్షన్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు..'చైనామెన్ తర్వాత ఇప్పుడు ఆక్వామెన్ వచ్చాడు', 'స్విమ్మర్ కావాలనుకుంటే.. పేరెంట్స్ బలవంతంగా క్రికెట్లో చేర్పించారు', 'హర్భజన్ యాక్షన్‌కు 5 రేట్లు స్పీడ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.
-
When you wanted to become a swimmer but parents forced you to join cricket#CricketTwitter pic.twitter.com/OMoRWOH0Tx
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">When you wanted to become a swimmer but parents forced you to join cricket#CricketTwitter pic.twitter.com/OMoRWOH0Tx
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) November 23, 2023When you wanted to become a swimmer but parents forced you to join cricket#CricketTwitter pic.twitter.com/OMoRWOH0Tx
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) November 23, 2023

క్రికెట్లో మరికొన్ని ఫన్నీ బౌలింగ్ యాక్షన్లు..
కెవిన్ కొతిగొడ (శ్రీలంక).. 2018 అండర్ 19 ఆసియా కప్‌లో, శ్రీలంక ఆర్థోడాక్స్ బౌలర్ వింతగా బౌలింగ్ చేశాడు. అతడి స్ట్రైల్ విచిత్రంగా ఉందని అప్పట్లో తెగ కామెంట్ చేశారు. మీరూ ఓసారి ఆ విడియో చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పాల్ ఆడమ్స్ (సౌతాఫ్రికా).. సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్.. జంప్ చేస్తూ బౌలింగ్ చేస్తాడు. అతడి డిఫరెంట్ యాక్షన్‌కు బ్యాటర్లు కాస్త తికమక పడేవారు. ఆడమ్స్ తన కెరీర్లో 69 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మొత్తంగా 163 వికెట్లు పడగొట్టాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేదార్ జాదవ్ (భారత్).. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్.. తన బౌలింగ్ యాక్షన్ పట్ల పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐసీసీ కూడా తన యాక్షన్‌ను మార్చకోమని ఒకట్రెండు సార్లు హెచ్చరించింది.