మరో వారం రోజుల్లో భారత్‌లో క్రికెట్ పండగ ప్రారంభంకానుంది. ఈ నెల 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 16వ సీజన్ మొదలుకానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కోసం పది ఫ్రాంచైజీల ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే కొంతమంది ప్లేయర్స్ ప్రాక్టీస్ కూడా షురూ చేసేశారు. మరికొంతమంది రెండు మూడు రోజుల్లో తమ క్యాంపులకు చేరుకుని శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ సీజన్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఏ వ్యూహాలు రచించాలి? వారిని ఎలా దెబ్బ కొట్టాలి? ఎవరిని తుది జట్టులోకి దింపాలి? అంటూ ఆయ ఫ్రాంచైజీలు, వారి కెప్టెన్లు చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే వీటితో పాటు అన్ని ఫ్రాంచైజీలను, క్రికెట్ అభిమానులను ఓ సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. అదే గాయాల బెదడ. పలువురు ప్లేయర్స్ ఈ గాయాలా కారణంగా సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు లేదంటే పూర్తి సీజన్‌కు దూరమవుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో తమ ప్రదర్శనతో దుమ్మురేపే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయాల కారణంగా దూరమవ్వగా.. మరి కొంతమంది కీలక ప్లేయర్స్ కూడా లీగ్‌కు దూరమయ్యారు. మరి ఇప్పటివరకు ఎవరెవరూ దూరమయ్యారో తెలుసుకుందాం..
- ముంబయి స్టార్ పేసర్ బుమ్రా.. వెన్ను గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ తర్వాత టీమ్ఇండియాకు దూరమయ్యాడు. ఈ గాయం తీవ్రత తగ్గడానికి అనుకున్నదానికన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
- ముంబయికి చెందిన మరో ఆటగాడు జయ్ రిచర్డ్‌సన్.. తుంటి గాయం కారణంగా ఈ మెగాటోర్నీకి అందుబాటులో ఉండట్లేదు. త్వరగా కోలుకోని వచ్చే సీజన్లో బరిలోకి దిగుతానని అతడే స్వయంగా తెలిపాడు.
- రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇతడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.
- దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇతడు దూరమయ్యాడు.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విల్ జాక్స్ కూడా ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయప్డడాడు. ఈ కారణంగా అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
- పంజాబ్ కింగ్స్ ఆటగాడు జానీ బెయిర్ స్టో.. గతేడాది కాలి గాయం బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం అతడు ఫిట్‌గానే ఉన్నాడు. కానీ రాబోయే యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని తాజా సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.
- కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ కూడూ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడికి సర్జరీ చేయించుకోనున్నాడు. ఈ కారణంగా అతడు అందుబాటులో ఉండట్లేదు. కానీ దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
- కోల్‌కతాకు చెందిన మరో ప్లేయర్ లాకీ ఫెర్గూసన్ కూడా మోచేతి గాయం కారణంగా 16వ ఎడిషన్‌లో ఆడే అవకాశాలు కనిపించట్లేదు.
- చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముఖేష్ చౌదరి ఆడేది అనుమానంగానే మారింది. అతడిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
- భారత జట్టు ఎంట్రీ కోసం ఎదురచూస్తున్న లఖ్‌నవూ ప్లేయర్ మోహ్సిన్ ఖాన్ కూడా ఆడేది అనుమానంగానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
- చెన్నై సూపర్ కింగ్స్ కైల్ జెమీసన్ నడుము నొప్పితో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా గిల్!.. హార్దిక్ పోస్ట్‌కు స్పాట్ పెట్టాడుగా!