ETV Bharat / sports

'హార్దిక్​ కంటే శార్దుల్​ బెటర్​.. అతనికే అవకాశాలివ్వండి' - శార్దుల్​పై శరణ్​దీప్ స్పందన

సుదీర్ఘ ఫార్మాట్​లో శార్దుల్​ ఠాకుర్​కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐకి సూచించాడు మాజీ సెలెక్టర్​ శరణ్​దీప్ సింగ్. వెన్నునొప్పి కారణంగా కేవలం బ్యాటింగ్​కే పరిమితమవుతున్న హార్దిక్​ పాండ్య.. తిరిగి బౌలింగ్​ను ఎప్పుడు మొదలు పెడతాడో తెలీదని పేర్కొన్నాడు. ​

shardul thakur, hardik pandya
శార్దుల్​ ఠాకుర్, హర్దిక్ పాండ్య
author img

By

Published : Jun 28, 2021, 8:38 PM IST

పేస్​ ఆల్​రౌండర్​గా హార్దిక్​ పాండ్య స్థానంలో శార్దుల్​ ఠాకూర్​కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మాజీ సెలెక్టర్​ శరణ్​దీప్​ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే బౌలింగ్​కు దూరంగా ఉంటున్న హార్దిక్..​ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్​లు వేయలేడని తెలిపాడు. భవిష్యత్​ను​ దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే శార్దుల్​ను సానబెట్టాలని సూచించాడు.

"ఇటీవల బ్యాటింగ్​కే పరిమితమైన పాండ్య.. వెనునొప్పి కారణంగా బౌలింగ్​లో సుదీర్ఘ స్పెల్​లు వేయడం లేదు.​ దీంతో మరో అదనపు బౌలర్​ను జట్టులోకి తీసుకోవాల్సి వస్తోంది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలియడం లేదు. కాబట్టి, హార్దిక్ స్థానంలో శార్దుల్​ వంటి ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలి. విజయ్ శంకర్, శివమ్​ దూబే వంటి వారిని ఎక్కువ మ్యాచ్​ల్లో ఆడించాలి," అని శరణ్​దీప్​ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గావస్కర్​ ట్రోఫీతో పాటు స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్​ సిరీస్​లో శార్దుల్ మంచి ప్రదర్శన చేశాడు. బంతితో పాటు బ్యాట్​తోనూ రాణించి జట్టుకు మంచి ఆల్​రౌండర్​గా మారాడు. దీంతో రాబోయే కాలంలో అతడు జట్టులో కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉందని శరణ్​దీప్​ అభిప్రాయపడ్డాడు.

సిరాజ్​ను ఆడించాలి..

యువ పేసర్​ మహమ్మద్ సిరాజ్​కు ఎక్కువ మ్యాచ్​ల్లో అవకాశాలు కల్పించాలని శరణ్​దీప్​ స్పష్టం చేశాడు. తుది జట్టులో స్థానం ఇవ్వాలని సూచించాడు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇద్దరూ స్పిన్నర్లను ఆడించడం మంచిదేనన్న మాజీ సెలెక్టర్​.. చివరికి పరిస్థితులు పేస్​కు అనుకూలించిందని తెలిపాడు. గత ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన సిరాజ్​ను జట్టులోకి తీసుకుంటే బాగుండేదని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: Michael Holding: 'ఐపీఎల్​​ అసలు క్రికెటే కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.