ఒకప్పటి గొప్ప క్రికెటర్లతో పోలిస్తే విరాట్ కోహ్లీకి కచ్చితమైన బలహీనత ఉందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. పదేపదే అతడు ఒకే తరహాలో ఔటవుతున్నాడని పేర్కొన్నాడు. ఈ బలహీనత అతడిని బాధిస్తుండొచ్చని వెల్లడించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ను అండర్సన్ పెవిలియన్ పంపించాడు. ఆఫ్‌స్టంప్ ఆవల ఐదు, ఆరో, ఏడో స్టంప్‌లైన్ మీదుగా వెళ్తున్న బంతులను వెంటాడి వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
"క్రికెట్లోని దిగ్గజాలతో పోలిస్తే విరాట్ కోహ్లీకి కచ్చితమైన బలహీనత ఉంది. సచిన్ తెందూల్కర్, సునిల్ గావస్కర్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాల్లో కచ్చితమైన బలహీనతలేమీ కనిపించవు. కానీ విరాట్‌కు ఆఫ్‌సైడ్ ఆవల బంతులు వేసిన ప్రతిసారీ అతడు వికెట్ ఇచ్చేస్తున్నాడు. అజింక్య రహానెలా అతడు భిన్నమైన తీరులో ఔటవ్వడం లేదు. ఇది కచ్చితంగా అతడికి ఆందోళన కలిగిస్తుంది" అని మంజ్రేకర్ తెలిపాడు.
"ఇంగ్లాండ్‌లో 2018లో కోహ్లీ పరుగులు చేయడానికి ఓ కారణం ఉంది. అతడు అందమైన కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లు ఆడటం మాత్రమే కాదు ఎక్కువ బంతులు వదిలేశాడు. ప్రస్తుతం అందుకతడు అలవాటు పడటం లేదు. ఇందుకు మానసిక శ్రమ అవసరం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు అండర్సన్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు కోహ్లీ మానసికంగా సిద్ధంగా లేడా? అని నాకు సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఇప్పుడతను ఎక్కువ బంతులు వదిలేయడం లేదు" అని సంజయ్ పేర్కొన్నాడు.
ఇవీ చూడండి: