లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టుకు(IND Vs ENG) టీమ్ఇండియా పేసర్ శార్దుల్ ఠాకుర్(Shardul Thakur) దూరమయ్యాడు. ప్రాక్టీస్‌లో తొడకండరం గాయం కారణంగా ఆ మ్యాచ్‌కు శార్దుల్ అందుబాటులో ఉండట్లేదని సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలిటెస్టులో(Nottingham Test) శార్దుల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నాలుగో పేసర్ కావాలనుకుంటే.. యాజమాన్యం ఇషాంత్ వైపు మొగ్గు చూపే అవకాశముంది.
బ్రాడ్కూ గాయం
కాగా, ఇంగ్లాండ్ శిబిరాన్ని గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) కుడికాలి పిక్క కండ బెణికిన కారణంగా రెండో టెస్టులో ఆడేది అనుమానంగానే కనిపిస్తుంది. బుధవారం ఈ పేసర్‌కు స్కానింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. జేమ్స్ అండర్సన్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఇతడు ఆడతాడా అనే విషయంలోనూ అనిశ్చితి నెలకొంది.
ఇదీ చూడండి.. 'ఆ విషయాన్ని పుజారా, రహానె గ్రహించాలి'