ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనలే లక్ష్యంగా భారత్​, ఇంగ్లాండ్​ అమీతుమీ

రెండో టెస్టు కోసం భారత్​, ఇంగ్లాండ్​ సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం అనంతరం.. స్వదేశంలో ఇంగ్లాండ్​ టీమ్​ఇండియాను దెబ్బకొట్టింది. రూట్​ ద్విశతకానికి తోడు.. ప్రత్యర్థి బౌలింగ్​కు భారత్​ విలవిల్లాడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్​ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితి భారత్​. ఈ నేపథ్యంలో శనివారం జరిగే రెండో టెస్టుపై ఆసక్తి నెలకొంది. ఉదయం 9.30కు చెన్నై వేదికగా మ్యాచ్​ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్​కు ప్రేక్షకులు హాజరుకానున్నారు.

Kohli's India seek redemption on rank turner; Axar, Hardik in fray
గెలుపు కోసం భారత్​- ఆధిక్యం కోసం ఇంగ్లాండ్​
author img

By

Published : Feb 12, 2021, 6:32 PM IST

శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు భారత్​, ఇంగ్లాండ్​లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉన్న పర్యటక జట్టు అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్​ మిగిలిన మూడు టెస్టుల్లో ఒక్క మ్యాచ్​ కూడా ఓడిపోకూడదు. రెండు టెస్టులు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్​కు 50 శాతం ప్రేక్షకులను కూడా అనుమతించనున్నారు.

స్పిన్నర్లకు పెద్దపీట..

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్​ విజయంతో అత్యుత్సాహంతో ఉన్న భారత్​కు.. సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టు ఓటమి జీర్ణించుకోలేనిది. 227 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణంగా రాణించగల కెప్టెన్​ కోహ్లీ సహా సీనియర్లు ఉన్నా భారత్​ ఓటమి పాలైంది.

ఇదిలా ఉండగా రెండో టెస్టు కోసం తయారు చేసిన చెపాక్​ పిచ్​ ఎక్కువగా స్పిన్నర్లకు సహకరించేదిగా ఉంది. తొలి రోజు నుంచే బంతి టర్న్​ అయ్యే అవకాశముంది. దీంతో భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​కు మరో ఎండ్​లో తగిన సహకారం అందించే బౌలర్​ కావాలి. గాయం నుంచి కోలుకున్న అక్షర్​ పటేల్​ మ్యాచ్​ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ రాణించాలని టీమ్​ఇండియా కోరుకుంటోంది. మరో స్పిన్నర్​నూ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఆల్​రౌండర్​గా హర్దిక్​..

ప్రస్తుతానికి బౌలింగ్​ చేయనప్పటికీ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యను ఆడించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. స్పిన్నర్లపై వేగంగా పరుగులు చేయగలడని, 10 ఓవర్లు వేసినా సరిపోతుందని యాజమాన్యం భావిస్తోంది.

ఇంగ్లాండ్​లో నాలుగు మార్పులు..

ఇంగ్లాండ్​ జట్టులోనూ నాలుగు మార్పులు చేసింది. జోఫ్రా ఆర్చర్​ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమవ్వగా.. అతని స్థానంలో బౌలింగ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ వోక్స్​కు స్థానం కల్పించింది యాజమాన్యం. పనిభారం తగ్గింపులో భాగంగా అండర్సన్​కు విశ్రాంతినిచ్చి అతని బదులుగా స్టువర్ట్​ బ్రాడ్​ను తీసుకుంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో అత్యధిక వికెట్లు తీసిన డామ్​ బెస్​​ను సైతం తప్పించి మొయిన్​ అలీకి చోటు కల్పించింది. తదుపరి మూడు టెస్టులకు వికెట్​ కీపర్​ జోస్​ బట్లర్​కు విశ్రాంతినిచ్చిన ఇంగ్లాండ్​ బోర్డు బెన్​ ఫోక్స్​ను టీమ్​లోకి తీసుకుంది.

ఆర్చర్​ గాయం నుంచి కోలుకుని మూడో టెస్టు నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ సారథి జో రూట్​.

టాస్​ కీలకం..

ఏదేమైనా రెండో టెస్టుకు టాస్​ కీలకం కానుంది. ​టాస్​ గెలిచిన జట్టు బ్యాటింగ్​కు మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత ఓపెనర్లలో నిలకడ లోపించింది. అడపాదడపా షాట్లు ఆడుతున్న ఓపెనర్​ రోహిత్​ శర్మ భారీ ఇన్నింగ్స్​ బాకీ ఉన్నాడు. ఆజింక్య రహానె విఫలమవ్వడం జట్టుపై ప్రభావం పడుతుంది. ఛెతేశ్వర్​ పుజారా, రిషభ్​పంత్​లు రాణిస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నారు.

కెప్టెన్​ కోహ్లీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో అర్ధశతకంతో రాణించి .. ఫాంలోకి వచ్చినట్లే కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో.. మ్యాచ్​ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్​ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో ఉంది కోహ్లీ సేన.

జట్లు:

భారత జట్టు: విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), ఆజింక్య రహానె(వైస్​ కెప్టెన్​), రోహిత్​ శర్మ, శుభ్​మన్​ గిల్​, ఛెతేశ్వర్​ పుజారా, రిషభ్​పంత్​(వికెట్​ కీపర్​), రవిచంద్రన్​ అశ్విన్​, జస్ప్రీత్​ బుమ్రా, ఇషాంత్​ శర్మ, మహమ్మద్​ సిరాజ్​, వాషింగ్టన్​ సుందర్​, కుల్దీప్​ యాదవ్​, అక్షర్​ పటేల్, హర్దిక్​ పాండ్య, మయాంక్​ అగర్వాల్, కేఎల్​ రాహుల్​, వృద్ధిమాన్​ సాహా, శార్దుల్​ ఠాకూర్​.

ఇంగ్లాండ్​ జట్టు: జో రూట్​(కెప్టెన్​), డామినిక్​ సిబ్లీ, రోరీ బర్న్స్​, ఒల్లీ పోప్, డాన్​ లారెన్స్​, బెన్​ స్టోక్స్​, బెన్​ ఫోక్స్​(వికెట్​ కీపర్), మొయిన్​ అలీ, క్రిస్​ వోక్స్​, స్టువర్ట్​ బ్రాడ్​, జాక్​ లీచ్​, ఒల్లీ స్టోన్​.

ఇదీ చదవండి: నాలుగు మార్పులతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ రె'ఢీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.