ETV Bharat / sports

IPL: వేగంగా ఐపీఎల్ పనులు.. త్వరలోనే షెడ్యూల్!

ఐపీఎల్​(IPL) రెండో దశకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే మ్యాచ్​ల ప్రణాళికను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 25 రోజుల్లోనే 31 మ్యాచ్​లు నిర్వహిస్తారని సమాచారం.

ipl, bcci
ఐపీఎల్, బీసీసీఐ
author img

By

Published : Jun 4, 2021, 3:04 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. షెడ్యూలు, వేదికలు, లాజిస్టిక్స్‌ తరలింపు వంటి అంశాల్లో త్వరలోనే స్పష్టత రానుంది. రెండో దశ షెడ్యూలులో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. 25 రోజుల్లోనే 31 మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం. తుది దశ, నాకౌట్‌ మ్యాచులన్నీ ఒకే వేదికలో ఉంటాయని, డబుల్‌ హెడర్స్‌ ఎక్కువ ఉంటాయని అంటున్నారు.

బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా ఇంతకుముందే దుబాయ్‌ వెళ్లారు. అక్కడే ఐసీసీ(ICC) సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌ రెండో దశకు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తి చేశారు. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చించి వేదికలను ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 17, 18, 19 తేదీల్లో ఏదో ఒక రోజు ఐపీఎల్‌ మొదలవ్వనుంది. జూన్‌ ఆఖరి వారంలో బహుశా షెడ్యూలును విడుదల చేస్తారని సమాచారం.

వాయిదా పడిన షెడ్యూలు ప్రకారం ఇక మిగిలింది 6 డబుల్‌ హెడర్స్‌ మాత్రమే. కేవలం 25 రోజుల విండోనే ఉండటం వల్ల వాటి సంఖ్యను 8 నుంచి 10 వరకు పెంచుతారట. అంటే కనీసం 8 లేదా 10 రోజులు రెండు మ్యాచులు నిర్వహిస్తారు. గత సీజన్‌ మాదిరిగానే దుబాయ్‌, షార్జా, అబుదాబిలో మ్యాచులు జరుగుతాయి. తుది దశ, నాకౌట్‌ మ్యాచులన్నీ ఒకే వేదికలో నిర్వహిస్తారని అంటున్నారు. బహుశా దుబాయ్‌ ఇందుకు వేదిక కావొచ్చు.

ఒకవేళ ప్రపంచకప్‌ యూఏఈలో జరిగే పక్షంలో అక్టోబర్‌ 1కి ముందే వేదికలను ఐసీసీకి అప్పగించాలి. బీసీసీఐ ఒక వేదికకు అనధికార అనుమతి తీసుకుందని తెలిసింది. యూఏఈకి శిబిరాలను, సామగ్రిని ఎప్పుడు తరలించాలి? ఆటగాళ్లను ఎప్పుడు తీసుకెళ్లాలి? వంటి విషయాల్లో స్పష్టత కోసం ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్​కు టీమ్ఇండియా​ ఎలా చేరుకుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.