ETV Bharat / sports

భారత్​ Vs ఇంగ్లాండ్​: కోహ్లీసేన జోరు కొనసాగించేనా? - ఇండియా vs ఇంగ్లాండ్​ తొలి టీ20 ప్రివ్యూ

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం తొలిమ్యాచ్‌ జరగనుంది. టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-1తో చిత్తు చేసిన కోహ్లీసేన.. టీ20ల్లోనూ అదే జోరు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు తాము నంబర్‌1గా ఉన్న టీ20ల్లో టీమిండియాపై నెగ్గి టెస్టు సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్‌ కోరుకుంటోంది.

India's quest for WC combination begin against England in T20I series
భారత్​ Vs ఇంగ్లాండ్​: కోహ్లీసేన జోరు కొనసాగించేనా?
author img

By

Published : Mar 11, 2021, 7:14 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-1 తేడాతో విజయఢంకా మోగించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్న కోహ్లీసేన.. ఇక టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. అయిదేళ్ల విరామం తర్వాత, ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ సిరీస్‌తోనే టీమ్‌ఇండియా సన్నాహం మొదలు కాబోతోంది.

ట్వంటీ20 వరల్డ్‌కప్‌ కోసం జట్టు కూర్పుపై ఓ అంచనాకు వచ్చేందుకు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఉపయోగపడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసీసీ ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ మొదటి స్థానంలోను, భారత్‌ రెండో స్థానంలోను ఉన్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.

ఓపెనర్లుగా..

ఈ సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా ఎవరిని ఓపెనర్‌గా పంపుతారన్నది ఆసక్తికరం. చాలా ఏళ్లు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ధావన్‌.. ఏడాది కిందట ఫామ్‌కోల్పోయి జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఈ సమయంలో కేఎల్​ రాహుల్‌ నిలకడగా ఆడి ఓపెనింగ్‌లో స్థిరపడ్డాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేలు, టీ20లకు రోహిత్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ధావన్‌కు అవకాశం దక్కింది. ఇప్పుడు రోహిత్‌ ఆడబోతున్నాడు. రాహుల్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఒక వేళ ధావన్‌ను తుదిజట్టులో ఆడించాలని ప్రయత్నిస్తే అతన్ని ఓపెనర్‌గా పంపి రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లలో ఒకరికే తుదిజట్టులో చోటు దక్కుతుంది.

హార్దిక్​ బౌలింగ్​కు రెడీ!

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను బౌలర్‌ పాత్రలో చూడటం అరుదైపోయింది. 2019లో వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక అతను చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. పునరాగమనం తర్వాత ఆడిన మ్యాచ్‌లు తక్కువ. నిరుడు ఐపీఎల్‌లో అతను బౌలింగే చేయలేదు. ఆస్ట్రేలియాతో ఒక్క వన్డేలో మాత్రమే 4 ఓవర్లు వేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం హర్దిక్‌ ముమ్మరంగా సాధన చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాలని కోరుకుంటున్నాడు.

స్పెషలిస్టు బ్యాట్స్​మన్​గా పంత్​?

భారత్‌ చివరగా ఆడిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో రిషబ్‌పంత్‌కు తుది జట్టులో స్థానం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో పంత్‌ అదరగొట్టాడు. టీ20ల్లోనూ పంత్‌కు తప్పనిసరిగా తుదిజట్టులో స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో కేఎల్​ రాహుల్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడించడం ఇటీవల భారత్‌ మొదలుపెట్టింది. ఇప్పుడు పంత్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా అయినా తీసుకోవాల్సిందే అన్న డిమాండ్లు మొదలయ్యాయి. మరి పంత్‌ను వికెట్‌కీపర్‌గానే ఆడిస్తారా? లేక రాహుల్‌కే గ్లోవ్స్‌అప్పగించి స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఆడించి చూస్తారా అన్నది తేలాల్సి ఉంది.

పేస్​దళానికి సారథిగా భువీ..!

గాయాలతో గత రెండేళ్లలో చాలా కాలం మైదానానికి దూరంగా ఉన్నాడు పేసర్‌ భువనేశ్వర్‌. ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో చోటు కోసం చాలామంది పేసర్లు ఎదురు చూస్తున్న నేపథ్యంలో భువి సత్తా చాటాల్సిందే.

బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో పేస్‌ దళానికి భువీనే సారథ్యం వహించాలి. డెత్‌ఓవర్లలో బౌలింగ్‌చేయడంలో నైపుణ్యం ఉన్న భువీ భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లాండ్‌పై ఈ మేరకు సత్తా చాటుతాడో వేచి చూడాలి.

పేస్​ దళమంతా బెంచ్​కే..

అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో యజువేంద్ర చాహల్‌తో పాటు అక్షర్‌పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు తుదిజట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. అలా జరిగితే పేసర్లు శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ బెంచ్‌కే పరిమితంకానున్నారు.

యువకులకు ఛాన్సు దొరికేనా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సత్తా చాటిన కొత్త కుర్రాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.. రాహుల్‌ తెవాతియా ఈ సిరీస్‌ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా ఒక్క టీ20నే ఆడిన స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ సైతం అవకాశం కోసం చూస్తున్నాడు. తుది జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది.. వాళ్లు ఏమేర రాణిస్తారు అన్నది చూడాలి.

పటిష్ఠంగా ప్రత్యర్థి జట్టు..

మరోవైపు టెస్టుల్లో ఓడి, పరిమిత ఓవర్ల క్రికెట్లో బదులు తీర్చుకోవడానికి బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది ఇంగ్లిష్‌జట్టు. బెన్‌స్టోక్స్‌, సామ్‌కరన్‌, మొయిన్ అలీ వంటి స్టార్‌ ఆటగాళ్లతో ఇంగ్లాండ్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. పేస్‌ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌, క్రిస్‌జోర్డాన్‌ ఆ జట్టుకు అండగా ఉన్నారు. అదిల్‌రషిద్‌.. స్పిన్‌ బౌలింగ్ ‌బాధ్యతలు మోయనున్నాడు. మ్యాచ్‌శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది

స్క్వాడ్స్​:

టీమ్ఇండియా: విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​ శర్మ (వైస్​కెప్టెన్​), కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​, రిషబ్​ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్​ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్​, భువనేశ్వర్​ కుమార్​, అక్షర్​ పటేల్​, వాషింగ్టన్​ సుందర్​, శార్దూల్​ ఠాకూర్​, నవదీప్​ సైనీ, దీపక్​ చాహర్​, రాహుల్​ తెవాతియా, ఇషాన్​ కిషన్​ (రిజర్వ్​ వికెట్​కీపర్​).

ఇంగ్లాండ్​: ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), జోస్​ బట్లర్​, జాసన్​ రాయ్​, లైమ్​ లివింగ్​స్టన్​, డేవిడ్​ మలన్​, బెన్​ స్టోక్స్​, మొయిన్​ అలీ, అదిల్​ రషీద్​, రీసె టాప్లే, క్రిస్​ జోర్డాన్​, మార్క్​ వుడ్​, సామ్​ కరన్​, టామ్​ కరన్​, సామ్​ బిల్లింగ్స్​, జానీ బెయిర్​స్టా, జోఫ్రా ఆర్చర్​.

ఇదీ చూడండి: టీ20 రికార్డులపై కన్నేసిన కోహ్లీ, రోహిత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.