ETV Bharat / sports

నాలుగో టెస్టుకు జట్టులోకి అశ్విన్​..! - భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఇషాంత్ స్కోర్

భారత్​-ఇంగ్లాండ్ మధ్య జరగబోయే నాలుగో టెస్టు కోసం ఇషాంత్​ శర్మని యాజమాన్యం పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇషాంత్​ స్థానంలో అశ్విన్​ను తీసుకోనున్నట్లు సమాచారం. అశ్విన్​ అయితే బౌలింగ్​, బ్యాటింగ్​ రెండూ చేయగలడనే నమ్మకంతోనే అశ్విన్​కు అవకాశం ఇచ్చే యోచనలో యాజమాన్యం ఉంది.

ఇషాంత్
ఇషాంత్
author img

By

Published : Aug 30, 2021, 5:33 AM IST

Updated : Aug 30, 2021, 9:15 AM IST

ఇంగ్లాండ్​పై మూడో టెస్ట్​లో ఘోర వైఫల్యం అనంతరం నాలుగో టెస్ట్​పై దృష్టిపెట్టింది టీమ్​ఇండియా. ఇందులో భాగంగా ఓవల్​లో జరగనున్న నాలుగో టెస్ట్​లో జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్​ పేసర్​ ఇషాంత్​ శర్మను పక్కనపెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో ఉమేశ్​ యాదవ్​ లేదా శార్దుల్​ ఠాకూర్​ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

నిలకడ లేమి..

గత రెండు టెస్టుల్లో ఇషాంత్ శర్మ పేలవ ప్రదర్శనే దీనికి కారణమని జట్టు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గాయాలతో బాధపడుతున్న ఇషాంత్ మూడో టెస్ట్​కు పూర్తిగా ఫిట్​గా ఉన్నాడా అనే సందేహాలు సైతం వచ్చిన నేపథ్యంలో.. తదుపరి టెస్టుకు అతన్ని పక్కనపెట్టడమే ఉత్తమమని భావిస్తున్నారట. గత మూడు టెస్టుల్లో అత్యధిక పరుగులు సమర్పించడమే గాక.. వికెట్లు తీయడంలో ఇషాంత్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్​ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఇషాంత్​ ఫాంపై స్పందించేందుకు నిరాకరిస్తూనే.. పేసర్ల రొటేషన్​పై ఆలోచిస్తామని చెప్పాడు.

జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న అశ్విన్​కు ​ఈ మ్యాచ్​లో చోటు కల్పించే అవకాశాన్ని కోహ్లీ పక్కనపెట్టలేడు. ఎందుకంటే.. ఇదే పిచ్​పై కౌంటీ ఆడిన అశ్విన్​.. సర్రే తరఫున మంచి ప్రదర్శన చేశాడు.

భారత్-ఇంగ్లాండ్ మధ్య సెప్టెంబర్ 2న ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్​ 1-1తో సమంగా ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 30, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.