ETV Bharat / sports

భారత్​ ఆలౌట్​- ఇంగ్లాండ్​ లక్ష్యం 482 - chidambaram stadium

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత్ 286 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యంతో పాటు అశ్విన్​(106) సెంచరీ, కోహ్లీ(62) హాఫ్​ సెంచరీ తోడవ్వడం వల్ల ప్రత్యర్థి ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్​​ బౌలర్లలో మొయిన్​ అలీ, లీచ్​ చెరో నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్​ ఓ వికెట్​ దక్కించుకున్నాడు.

india all out in second test second innings
టీమ్ఇండియా
author img

By

Published : Feb 15, 2021, 3:49 PM IST

Updated : Feb 15, 2021, 4:06 PM IST

చెపాక్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత్​ 83.2 ఓవర్లకు ​276 పరుగులు చేసి ఆలౌటైంది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యంతో పాటు అశ్విన్​(106) సెంచరీ, కోహ్లీ(62) హాఫ్​ సెంచరీ తోడవ్వడం వల్ల ఇంగ్లీష్​ జట్టు ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఆట సాగిందిలా

ఓవర్​నైట్​ స్కోరు 54/1తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమ్​ఇండియా మరో 232 పరుగులు చేసింది. స్పిన్​కు అనుకూలిస్తున్న పిచ్​పై తొలుత పరుగులు చేయడానికి భారత బ్యాట్స్​మెన్స్​ ఇబ్బంది పడ్డారు. ఆదిలోనే ఒకే ఓవర్​లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది టీమ్​ఇండియా. చెతేశ్వర్​​ పుజారా 55 పరుగుల వద్ద రెండో విక్​ట్​గా రనౌటయ్యాడు. ఆ వెంటనే లీచ్​ బౌలింగ్​లో అదే స్కోరు వద్ద రోహిత్ మూడో వికెట్​గా​ స్టంపౌటయ్యాడు. బ్యాటింగ్​ ఆర్డర్లో ఈ సారి ముందుగానే వచ్చిన పంత్​.. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి లీచ్​ బౌలింగ్​లోనే స్టంపౌట్​గా వెనుదిరిగాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన ఆజింక్య రహానె.. కెప్టెన్​ విరాట్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దేందుకు యత్నించాడు. ఈ జోడీ 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను మొయిన్​ అలీ దెబ్బకొట్టాడు. అక్షర్​ పటేల్​ కూడా అలీ బౌలింగ్​లో వికెట్ల ముందు దొరకిపోయాడు.

ఆదుకున్న కోహ్లీ-అశ్విన్​..

106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది టీమ్​ఇండియా. మహా అయితే ఇంకో 20-30 పరుగులకు ఇన్నింగ్స్​ ముగుస్తుందని భావించిన తరుణంలో.. క్రీజులోకి వచ్చిన అశ్విన్​ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ధాటిగా పరుగులు చేస్తూ కోహ్లీపై ఒత్తిడి తగ్గించాడు. ఈ క్రమంలోనే వీరిరువురు అర్ధ సెంచరీలు చేశారు. ఏడో వికెట్​కు 96 పరుగులు జోడించారు. 65వ ఓవర్లో బౌలింగ్​కు వచ్చిన అలీ.. విరాట్​ను ఎల్బీడబ్ల్యూగా ఔట్​ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుల్దీప్​ యాదవ్​(3), ఇషాంత్​ శర్మ(7) విఫలమయ్యారు. చివర్లో వచ్చిన సిరాజ్​(16*) అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్​​ బౌలర్లలో మొయిన్​ అలీ, లీచ్​ చెరో నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్​ ఓ వికెట్​ దక్కించుకున్నాడు.

అశ్విన్​ సెంచరీ

ఒకే టెస్టులో సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీయడం అశ్విన్​కు ఇది మూడో సారి. టెస్టులో అతడికి ఇది ఐదో సెంచరీ. తమిళనాడు తరఫున టెస్టులో చెపాక్​ స్డేడియంలో సెంచరీ చేసిన రెండో క్రికెటర్​గా నిలిచాడు అశ్విన్​. అంతకుముందు 1986/87లో పాకిస్థాన్​పై క్రిస్​ శ్రీకాంత్​ సెంచరీ చేశాడు.

ఇదీ చదవండి: యువరాజ్​ సింగ్​పై కేసు నమోదు.. ఎందుకంటే?

Last Updated : Feb 15, 2021, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.