ETV Bharat / sports

నాలుగో టెస్టు ముందు పిచ్​పై వాన్​ వివాదాస్పద పోస్ట్​

ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​.. మొతేరా పిచ్​పై తనకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కాడు. మొతేరా వికెట్​పై ఇటీవలే వ్యంగ్యంగా స్పందించిన వాన్​.. మైదానం గురించి మరోసారి తన సోషల్​మీడియాలో ప్రస్తావించాడు. దున్నిన నేల ఎదుట నిల్చున్న ఫొటోను షేర్​ చేస్తూ.. నాలుగో టెస్టు కోసం సన్నద్ధమవుతున్నట్లు పోస్ట్​ పెట్టాడు.

IND vs ENG: Michael Vaughan takes vile dig on Ahmedabad pitch ahead of 4th test
నాలుగో టెస్టు ముందు పిచ్​పై వాన్​ వివాదాస్పద పోస్ట్​
author img

By

Published : Mar 2, 2021, 8:02 PM IST

Updated : Mar 2, 2021, 8:17 PM IST

టీమ్ఇండియాతో నాలుగో టెస్టు జరగనున్న మొతేరా పిచ్​పై ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​ మరోసారి అభ్యంతర పోస్ట్​ షేర్​చేశాడు. దున్నిన నేలపై బ్యాట్​తో ఫోజులిచ్చిన ఫొటోను పోస్ట్​ చేస్తూ.. "నాలుగో టెస్టు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి" అని వ్యంగంగా పేర్కొన్నాడు. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు ఇలాంటి పోస్టులపై భారత అభిమానులు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అహ్మదాబాద్​ వేదికగా జరిగిన పింక్​బాల్​ టెస్టులో ఇంగ్లాండ్​ ఘోర పరాజయం పట్ల పిచ్​పై విమర్శలు గుప్పించాడు​ వాన్​. రైతు పొలాన్ని దున్నుతున్న ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేస్తూ.. 'మొతేరా పిచ్​ను క్యూరేటర్​ తయారు చేసేది ఇలానే!' అంటూ పోస్ట్​ పెట్టాడు. మూడో టెస్టు రెండు రోజుల్లో ముగియడంపై పిచ్​ను పరిశీలించాలని ఐసీసీని కోరాడు. దీనిని భారత అభిమానులతో పాటు క్రికెట్​ విశ్లేషకులు తప్పుబట్టారు.

ఇదీ చూడండి: టీమ్​ సెలెక్షన్​పై ఇంగ్లాండ్​ బోర్డుకు వాన్​ చురకలు

Last Updated : Mar 2, 2021, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.