ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ కఠిన పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్ చేశాడని, అతడి ఫుట్‌వర్క్ అద్భుతంగా ఉందని మాజీ క్రికెటర్ బాయ్‌కాట్ ప్రశంసించారు. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సూచించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కోహ్లీ(62) రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్(106)తో కలిసి ఏడో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
అయితే, బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై భారత సారథి అమోఘంగా ఆడాడని బాయ్‌కాట్ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు. భారత్‌లో ఫాస్ట్ పిచ్‌లు ఉండవని, అది గొప్ప విషయమని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వివరించారు. ఇక్కడ ఆడేటప్పుడు క్రీజులో కుదురుకొని షాట్లు ఎంపిక చేసుకునే వీలుందని చెప్పారు. ఈ మ్యాచ్‌లో విరాట్ పట్టుదలగా ఆడాడాని, ఫుట్‌వర్క్ బాగుందని మెచ్చుకున్నారు. బంతి పడే లెంగ్త్‌ను కోహ్లీ బాగా అర్థం చేసుకున్నాడని, దాంతో షాట్ల ఎంపిక కూడా కచ్చితంగా ఉందని బాయ్‌కాట్ పేర్కొన్నారు. కఠిన పిచ్ మీద కూడా బాగా ఆడొచ్చనే విషయాన్ని కోహ్లీ రుజువు చేశాడన్నారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమానం చేసింది. ఇక ఈనెల 24 నుంచి అహ్మదాబాద్‌లో డే/నైట్ (మూడో) టెస్టు జరగనుంది.
ఇదీ చదవండి:ఐపీఎల్ వేలం: రికార్డు సృష్టించిన మోరిస్, మెరెడిత్, కృష్ణప్ప