ETV Bharat / sports

మూడో టెస్టుకు ఇంగ్లాండ్​ స్టార్ బౌలర్ దూరం! - భారత్​ ఇంగ్లాండ్​ సిరీస్

భారత్​తో జరిగే మూడో టెస్టుకు ఇంగ్లాండ్​ బౌలర్​ మార్క్ వుడ్​ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న అతడు ఆడటంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని కోచ్ స్పష్టం చేశారు.

Mark Wood latest news
మూడో టెస్టుకు ఆ ఇంగ్లాండ్​ ఆటగాడు దూరం!
author img

By

Published : Aug 18, 2021, 8:31 AM IST

ఇంగ్లాండ్​-భారత్​ మధ్య జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు పేసర్​ మార్క్ వుడ్​ ఆడటంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రెండో టెస్టు చివరి రోజున అతని కుడి భూజానికి గాయం కావడమే ఇందుకు కారణం. ఆ మ్యాచ్​లో గాయమైనా సరే వుడ్ బౌలింగ్​ వేశాడు. ​

'ప్రస్తుతం వుడ్​ను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు రోజులు గమనించిన తర్వాత అతడు మూడో టెస్టులో​ ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటాం'

-సిల్వర్​ వుడ్​, ఇంగ్లాండ్​ జట్టు కోచ్​

మూడో టెస్టుకు ఆటగాళ్లను ఇంగ్లాండ్​ ఇంకా ప్రకటించాల్సి ఉంది. తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న స్టువర్ట్​ బ్రాడ్​ మూడో టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. లీడ్స్​లో ఆగస్టు 25 నుంచి ఈ మ్యాచ్​ ప్రారంభం అవుతుంది. తొలి టెస్టు వర్షం వల్ల డ్రా కాగా, లార్డ్స్​లో జరిగిన రెండో టెస్టులో టీమ్​ఇండియా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం 1-0తో సిరీస్​లో ఆధిక్యంలో ఉంది.

ఇదీ చదవండి : ఇంగ్లాండ్​ టెస్టు జట్టులా లేదు: గావస్కర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.