ETV Bharat / sports

ఎదురుచూపులకు తెర.. స్టేడియం కళకళ - అభిమానుల సందడితో చెపాక్​ స్టేడియం

చెపాక్​ స్టేడియం అభిమానుల రాకతో సందడిగా మారింది. దాదాపు ఏడాదిన్నర కాలంగా మ్యాచ్​లను ప్రత్యక్షంగా వీక్షించని ప్రేక్షకులు.. తాజా మ్యాచ్​తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Chepauk Stadium became bustling with the arrival of fans
అభిమానుల సందడితో చెపాక్​ స్టేడియం
author img

By

Published : Feb 13, 2021, 10:00 AM IST

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో చెపాక్​ స్టేడియం అభిమానులతో సందడిగా మారింది. దాదాపు ఏడాదిన్నర విరామం అనంతరం ప్రేక్షకులు మైదానంలో మ్యాచ్​ చూడటం విశేషం.

కరోనా కారణంగా గతేడాది మ్యాచ్​లు సరిగ్గా జరగలేదు. ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టు కూడా అభిమానులు లేకుండానే సాగింది. అయితే తాజా మ్యాచ్​కు 50శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లన్నీ హాట్​కేకుల్లాగా అమ్ముడుపోయాయి. దీంతో స్టేడియం కళకళలాడుతోంది. వీక్షకుల రాకతో అటు ఆటగాళ్లకూ ప్రత్యేక జోష్​ వచ్చింది.

మరోవైపు చెపాక్​ స్డేడియంలో తొమ్మిదేళ్లుగా వాడకుండా ఉన్న ఐ, జే, కే స్టాండ్స్​లో కూర్చునేందుకు ఈసారి అనుమతి లభించింది.

ఇదీ చదవండి: రెండో టెస్టు: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.