ETV Bharat / sports

ఆ ఇండియా స్టార్‌కే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'.. తేల్చిచెప్పిన ఇంగ్లాండ్ కెప్టెన్!

టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కోసం మొత్తం 9 మంది ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనలిస్టు ఇంగ్లాండ్ సారధి జోస్ బట్లర్ తానైతే ఈ అవార్డు ఎవరికిస్తానో వెల్లడించాడు. ఎవరికంటే?

player of the tournament
player of the tournament
author img

By

Published : Nov 12, 2022, 10:35 PM IST

Updated : Nov 12, 2022, 10:59 PM IST

Buttler Surya Kumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు లభిస్తుంది. ఈసారి ఈ అవార్డు కోసం మొత్తం 9 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వీరిలో టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ తదితరులు ఉన్నారు.

Player Of The Tournament: ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనలిస్టు ఇంగ్లాండ్ సారధి జోస్ బట్లర్ తనైతే ఈ అవార్డు ఎవరికిస్తానో వెల్లడించాడు. ఈ అవార్డు టీమ్​ఇండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కే దక్కాలని అన్నాడు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన సూర్య.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అతను జింబాబ్వేపై ఆడిన ఇన్నింగ్స్ ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సూర్యకుమార్‌కు ఈ అవార్డు ఇవ్వాలని బట్లర్ చెప్పడంతో నెట్టింట ట్రోలర్లు రెచ్చిపోతున్నారు. ఇంగ్లాండ్‌తో ఆడిన సెమీఫైనల్‌లో సూర్యకుమార్ 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. అందుకే బట్లర్ కూడా ఈ అవార్డు సూర్యకు ఇవ్వమంటున్నాడని ట్రోలర్స్ ఎగతాళి చేస్తున్నారు. అలాగే జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పిల్ల జట్ల మీదనే సూర్య ప్రతాపం చూపించాడని, సౌతాఫ్రికాపై ఆడినా జట్టు ఓడిపయిందని అంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన కీలకమైన మ్యాచుల్లో సూర్యకుమార్ చేతులెత్తేశాడని విమర్శిస్తున్నారు.

Last Updated : Nov 12, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.