ENG vs SL World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ పోరులో శ్రీలంక అదరగొట్టింది. ఇప్పటివరకు 5 మ్యాచులాడిన ఆ జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తాజా మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక టీమ్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి మైదానంలో శ్రీలంక బౌలర్ల దూకుడు ముందు ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ శతకం చేయలేకపోవడం గమనార్హం.
దెబ్బ మీద దెబ్బ..
ఇంగ్లాండ్‌కు వరుసబెట్టి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పసికూన అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. తనకన్నా బలహీన శ్రీలంకపై చిత్తుగా ఓడి సెమిస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. చెప్పాలంటే ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు గల్లంతైనట్టే. ఇప్పటివరకు ఐదు మ్యాచులాడిన ఇంగ్లాండ్.. తాజా ఓటమితో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్..
బెన్‌స్టోక్స్ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్. జానీ బెయిర్‌స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) కాసేపు నిలకడగానే ఆడారు. కానీ, ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆ జట్టు 85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (15; 15 బంతుల్లో) కూడా నిరాశపరిచాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి స్కోర్ బోర్డును వంద దాటించాడు. క్రిస్ వోక్స్ (0), ఆదిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14*) రన్స్ చేశారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2 వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణ ఒక వికెట్ తీశాడు.
శ్రీలంక ఇన్నింగ్స్..
పథుమ్ నిశంక (77*; 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమరవిక్రమ (65*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (11, 12 బంతుల్లో 2 ఫోర్లు), కుశాల్ పెరేరా (4; 5 బంతుల్లో 1 ఫోర్)
వికెట్లు టపాటపా..
మొదటి ఆరు ఓవర్లకు ఇంగ్లాండ్ 44/0 స్కోరుతో ఫర్వాలేదనిపించే స్థితిలోనే ఉంది. ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన లంక బౌలర్ ఏంజెలో మాథ్యూస్ తన తొలి ఓవర్‌లోనే మలన్‌ను ఔట్ చేయడం వల్ల ఇంగ్లాండ్ పతనానికి తెరలేచింది. మలన్.. వికెట్‌కీపర్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇవ్వగా.. తర్వాత వచ్చిన జో రూట్ రనౌటయ్యాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ బెయిర్‌స్టో కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. అతడు రజిత బౌలింగ్‌లో మిడాన్‌లో ధనంజయకు చిక్కాడు. లాహిరు కమార తన వరుస ఓవర్లలో బట్లర్, లివింగ్ స్టోన్‌లను పెవిలియన్‌కు పంపాడు. బట్లర్.. కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మొయిన్ అలీని 25 ఓవర్‌లో మాథ్యూస్ వెనక్కి పంపాడు. రజిత బౌలింగ్‌లో క్రిస్ వోక్స్.. సమరవిక్రమకు చిక్కాడు. ఒంటరి పోరాటం చేస్తున్న స్టోక్స్‌ను లాహిరు కుమార ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన ఆదిల్ రషీద్ 32 ఓవర్‌లో రనౌట్ కాగా.. తీక్షణ బౌలింగ్‌లో మార్క్‌వుడ్ స్టంపౌట్ కావడం వల్ల ఇంగ్లాండ్ 156 పరుగులే చేయగలిగింది.
Glenn Maxwell World Cup 2023 : మ్యాక్స్‌వెల్ ఆటంటే అంతే.. దెబ్బకు మైదానం షేక్..
Hardik Pandya Injury Update : బిగ్ షాక్.. హార్దిక్ గాయం అంత తీవ్రమా.. ఇక వరల్డ్ కప్ ఆడలేడా?