Eng vs Pak World Cup 2023 : 2023 వరల్డ్‌కప్ టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ గెలుపుతో ముగించింది. శనివారం కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్.. 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ (38), మహ్మద్ రిజ్వాన్ (36) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. చివర్లో హారిస్ రౌఫ్ (35) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే 3, మొయిన్ అలీ 2, ఆదిల్ రషీద్ 2, అట్కిసన్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ దక్కించుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు రెండో బంతికే షాక్ తగిలింది. అబ్దుల్ షఫిక్ (0) డకౌటయ్యాడు. మూడో ఓవర్లో మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (1) పెవిలియన్ చేరాడు. బాబర్, రిజ్వాన్ కాసేపు పోరాడారు. వీరిద్దరూ 51 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. ఇక వీరూ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. బాబర్‌ను అట్కిసన్ వెనక్కిపంపగా.. రిజ్వాన్‌ను మొయిన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సౌద్ షకీల్ (29) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో రౌఫ్ (35), షహీన్ అఫ్రిదీ (25) పోరాడారు. ఆఖర్లో వోక్స్.. రౌఫ్ వికెట్ తీయడం వల్ల పాకిస్థాన్ ఓటమి ఖరారైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ బ్యాటర్ల వరకు అందరూ ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించారు. ఓపెనర్లు డేవిడ్ మలన్ (31), జాని బెయిర్ స్టో (59), రూట్ (60), బెన్ స్టోక్స్ (84), బట్లర్ (27), హ్యారీ బ్రూక్ (30) రాణించారు. చివర్లో డేవిడ్ విల్లే 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సహా 15 పరుగుల చేశాడు. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, మహ్మద్ వసీమ్ 2, షహీన్ అఫ్రిదీ 2, ఇఫ్తికార్ ఒక వికెట్ పడగొట్టారు.
-
We end our 2023 World Cup campaign with a win ✅ #EnglandCricket | #CWC23 pic.twitter.com/82QB4hxbrv
— England Cricket (@englandcricket) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We end our 2023 World Cup campaign with a win ✅ #EnglandCricket | #CWC23 pic.twitter.com/82QB4hxbrv
— England Cricket (@englandcricket) November 11, 2023We end our 2023 World Cup campaign with a win ✅ #EnglandCricket | #CWC23 pic.twitter.com/82QB4hxbrv
— England Cricket (@englandcricket) November 11, 2023
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సెంచరీతో అదరగొట్టిన స్టోక్స్- నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
'మా లెక్కలు మాకున్నాయి, అతడు ఉంటే కచ్చితంగా సెమీస్‌కు చేరతాం!': బాబర్