ETV Bharat / sports

ENG Vs NZ: రెండో టెస్టులో శాంటర్న్ ఔట్​.. విలియమ్సన్ డౌట్​ - చూపుడు వేలు గాయంతో శాంటర్న్

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కివీస్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఆ జట్టు స్పిన్నర్​ శాంటర్న్ చూపుడు వేలి గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కాగా.. కెప్టెన్ విలియమ్సన్​ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. అతడు జట్టులో ఉండేది లేనిది బుధవారం ప్రకటించనుంది క్రికెట్​ న్యూజిలాండ్.

williamson, new zealand captain
కేన్ విలియమ్సన్​, కివీస్ కెప్టెన్
author img

By

Published : Jun 9, 2021, 9:35 AM IST

ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)​కు ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. తొలి టెస్టులో చూపుడు వేలుకు గాయం కావడం వల్ల రెండో టెస్ట్​కు స్పిన్నర్​ శాంటర్న్​ పక్కకు తప్పుకోగా.. కెప్టెన్ విలియమ్సన్(Williamson)​ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మోచేతి గాయంతో బాధపడుతున్న కివీస్​ సారథి విలియమ్సన్​ పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్(Gary Stead) తెలిపాడు. రూట్​ సేనతో తుది టెస్టుకు అందుబాటులో ఉండేది లేనిది బుధవారం ప్రకటిస్తామన్నాడు. గురువారం నుంచి ఎడ్జ్​బాస్టన్​ వేదికగా ఇంగ్లాండ్​తో రెండో టెస్టు ప్రారంభం కానుంది.

తొలి టెస్టుకు దూరమైన పేసర్ ట్రెంట్​ బౌల్ట్​.. ఆఖరి మ్యాచ్​కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే, మొదటి మ్యాచ్​లో సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్​లో 13 పరుగులు చేసి పెవిలియన్​ చేరగా.. రెండో ఇన్నింగ్స్​లో 1 రన్​కే వెనుదిరిగాడు.

ఇదీ చదవండి: 'రాబిన్​సన్​లో మార్పు వచ్చింది.. జట్టు మద్దతు ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.