ETV Bharat / sports

కోహ్లీని అప్పుడు పూర్తిగా నమ్మలేదు: డివిలియర్స్​

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్​, టీమ్ ఇండియా సారథిల స్నేహం(Ab de villiers kohli)​ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్​లో ఆర్​సీబీ తరఫున గత కొన్నేళ్లుగా ఆడుతున్న వీరిద్దరూ.. తమ ఆటతో అభిమానులను అలరిస్తూ వచ్చారు. అయితే.. కోహ్లీని డివిలియర్స్ తొలిసారి​ ఎప్పుడు కలిశాడు. కోహ్లీ గురించి అప్పుడు ఏబీ ఏం అనుకున్నాడంటే?

kohli ab de villiers friendship
కోహ్లీ, ఏబీ
author img

By

Published : Nov 21, 2021, 11:05 AM IST

క్రికైట్ మైదానంలో బ్యాటింగ్​తో గత పదేళ్లుగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ ఏబీ డివిలియర్స్​, టీమ్ ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగించారు. ఐపీఎల్​లో ఆర్​సీబీ తరఫున ఆడిన వీరిద్దరూ కలిసి ట్రోఫీని సాధించలేకపోయినా.. తమ ఆటతీరుతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు.

ఐపీఎల్​లో 2008లో ఆర్​సీబీ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆ జట్టులోనే ఉన్న కోహ్లీ.. 2011 నుంచి ఏబీ డివిలియర్స్​ రాకతో(Rcb ab de villiers), అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటూ వచ్చాడు. మైదానంలోనే కాకుండా వీరిద్దరి స్నేహం(Kohli ab friendship).. బయట కూడా అలానే అల్లుకుపోయింది. ఇటీవల అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని ఏబీ డివిలియర్స్​ సంచలన ప్రకటన(Ab de villiers retirement) చేశాడు. ఈ క్రమంలో.. 'మన బంధం ఆటను మించింది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది' అని కోహ్లీ చేసిన భావోద్వేగ ట్వీట్​.. ఏబీతో అతడి సాన్నిహిత్యానికి ప్రత్యేక సాక్ష్యం. అయితే.. అంతటి స్నేహితులైన కోహ్లీ, డివిలియర్స్​ మొదటిసారి ఎలా కలిశారు? కోహ్లీని చూసి ఏబీ ఏం అనుకున్నాడు? ఈ విషయాలను గతేడాది జరిగిన ఇన్​స్టా లైవ్​లో కోహ్లీ సమక్షంలోనే డివిలియర్స్ షేర్(Ab de villiers about virat kohli) చేసుకున్నాడు. ఆ విషయాలు ఇప్పుడు మరోసారి మీకోసం.

kohli ab de villiers friendship
కోహ్లీ, ఏబీ

"అదో ఆసక్తికరమైన కథ. కొన్నేళ్ల నుంచి ఓ వ్యక్తి గురించి వింటూ ఉంటే.. చాలా ఆత్రుతగా ఉంటుంది. మార్క్ బౌచర్​ ద్వారా నీ గురించి నేను చాలా విన్నాను. ఆర్​సీబీ తరపున నువ్వు ఆడటం ప్రారంభించినప్పుడు నీ వయసు 18-19 ఏళ్లు ఉంటాయని అనుకుంటాను. అప్పటి నుంచి నాకు నువ్వు తెలుసు. కానీ, నిన్ను నేను ఎప్పుడూ కలవలేదు. బౌచర్​ నీ గురించి చెబుతూ ఉండేవాడు. జోహన్నెస్​బర్గ్​లో నెట్స్ నుంచి వస్తుంటే 'హాయ్'​ అని నీతో అన్నాను. కానీ, అప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్మలేదు"

-ఏబీ డివిలియర్స్, దక్షిణాఫ్రికా ఆటగాడు

అయితే.. కోహ్లీని పూర్తిగా అర్థం చేసుకోవాడనికి తనకు ఎక్కువ సమయం పట్టలేదని డివిలియర్స్ వివరించాడు. "కోహ్లీలో ఉన్న మానవతా కోణాన్ని చూసేందుకు నాకు ఎక్కువ సమయం పట్టలేదు. కోహ్లీకి ఉన్న గొప్ప మనసు కారణంగా.. అతడంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది" అని డివిలియర్స్ చెప్పాడు. అదే లైవ్​లో మాట్లాడిన కోహ్లీ.. డివిలియర్స్​ను తొలిసారి కలిసినప్పుడు అతనితో తనకు ఇంతటి అనుబంధం ఏర్పడుతుందని ఊహించలేదని తెలిపాడు.

2018లోనే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ (AB De Villiers Retirement) ప్రకటించినా.. ఐపీఎల్​లో ఆడుతూ అభిమానులకు వినోదాన్ని పంచుతూవచ్చాడు ఏబీ డివిలియర్స్​. అయితే అనూహ్యంగా శుక్రవారం(నవంబరు 19) అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.