ETV Bharat / sports

'జాతిరత్నాలు' కడుపుబ్బా నవ్వించింది: కార్తిక్ - 'జాతిరత్నాలు' కడుపుబ్బా నవ్వించింది: కార్తిక్

నవీన్​ పొలిశెట్టి, రాహుల్​ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. తాజాగా ఈ సినిమాను వీక్షించిన టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.

Dinesh Karthik Praises Jathi Rathnalu team
కార్తిక్
author img

By

Published : Apr 16, 2021, 3:58 PM IST

నవీన్​ పొలిశెట్టి, రాహుల్​ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ చిత్రబృందం పనితీరును మెచ్చుకున్నాడు.

"జాతిరత్నాలు' గొప్ప కామెడీ సినిమా. ప్రతి సన్నివేశానికి నవ్వుతూనే ఉన్నా. అద్భుతమైన డైలాగ్స్, అసాధారణ దర్శకత్వం, అలాగే ప్రతి ఒక్కరి నమ్మశక్యం కాని నటన మెప్పించాయి. ఇలాంటి జోనర్​లో సినిమా తీయడం చాలా కఠినం. కానీ మీరు అద్భుతం చేశారు" అంటూ ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు కార్తిక్.

  • JATHI RATHNALU

    My goodness, what a laugh riot.I kept laughing in every scene.Amazing dialogues, outstanding direction and incredible performances by each n every one.More power to you guys. This is one genre that's probably the toughest and you guys aced it.Outstanding ❤️❤️❤️

    — DK (@DineshKarthik) April 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం ఐపీఎల్​తో బిజీగా ఉన్నాడు కార్తిక్. కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఇతడు తర్వాత మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్​ల్లో ఒక దాంట్లో నెగ్గిన కేకేఆర్ ఆదివారం బెంగళూరుతో జరిగే పోరు కోసం శ్రమిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.