ETV Bharat / sports

'పంత్​ కూడా సెహ్వాగ్​, గిల్​క్రిస్ట్ లాంటివాడే​'

author img

By

Published : Jun 5, 2021, 12:47 PM IST

టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్​పై ప్రశంసల జల్లు కురిపించాడు భారత క్రికెటర్​ దినేష్ కార్తీక్. మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, గిల్​క్రిస్ట్​.. ప్రత్యర్థులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారో.. పంత్​ కూడా అలాగే చూపిస్తున్నాడని తెలిపాడు.

dinesh karthik, rishabh pant
దినేష్ కార్తీక్, రిషభ్ పంత్

టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మన్​ రిషభ్ పంత్ (Rishabh Pant)​పై ప్రశంసల జల్లు కురిపించాడు భారత వెటరన్​ క్రికెటర్ దినేష్ కార్తీక్(Dinesh Karthik). మాజీలు వీరేంద్ర సెహ్వాగ్​, గిల్​క్రిస్ట్​ లాగే.. ప్రత్యర్థి జట్లపై ప్రభావం చూపిస్తున్నాడని కొనియాడాడు. క్రికెట్​లో అతడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడని తెలిపాడు. ఐపీఎల్​తో చాలా మంది వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్లు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్తుత్తమ వికెట్​ కీపర్లలో సాహా ఒకడని అభిప్రాయపడ్డాడు. తాను ఫిట్​గా ఉన్నంతవరకు క్రికెట్​ ఆడతానని స్పష్టం చేశాడు. క్రికెట్​ వ్యాఖ్యాతగా మారబోతున్నందుకు సంతోషంగా ఉందని డీకే తెలిపాడు.​

"రిషభ్‌ పంత్‌ జట్టుకు ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాడు. అవసరం మేరకు అదనపు బౌలర్‌ లేదా బ్యాట్స్‌మన్‌ను తీసుకొనేందుకు జట్టు యాజమాన్యానికి అవకాశం దొరుకుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అతడు ప్రత్యర్థి మనసులో భయం పెంచుతాడు. వీరేంద్ర సెహ్వాగ్‌(Sehwag), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రత్యర్థిపై చూపించిన ప్రభావమే అతడూ చూపిస్తున్నాడు."

-దినేష్ కార్తీక్‌, టీమ్ఇండియా క్రికెటర్.

"నా కెరీర్‌ సాగిన తీరుకు గర్వపడతాను. జట్టులో దొరికిన ప్రతి అవకాశాన్నీ ఆస్వాదించాను. ప్రస్తుతం దేశానికి ఆడకముందే కుర్రాళ్లు పరిణతి సాధిస్తున్నారు. ఐపీఎల్‌లో వారు అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడటమే ఇందుకు కారణం. లీగ్‌ వల్ల ప్రతిభావంతులైన వికెట్‌ కీపర్లు బయటకు వచ్చారు. ఇప్పుడు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ కాకుండా బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ కీపర్లు తయారవుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో సాహా ఒకడు. రిషభ్‌ పంత్‌ అద్భుత బ్యాటింగ్‌ మెరుపులతో సాహా (Wriddhiman Saha)కు చోటు దొరకడం లేదు. ఇతర దేశాల్లో ఆట నుంచి వీడ్కోలు తీసుకోకముందే వ్యాఖ్యానం చేస్తుంటారు. అందుకే నేనూ కామెంటరీ చేయబోతున్నాను. ఫిట్‌నెస్‌ ఉన్నంత వరకు క్రికెట్లో కొనసాగుతాను" అని డీకే వివరించాడు.

ఇదీ చదవండి: T20 World Cup: 'వేదిక భారత్​ కాదు.. యూఏఈనే'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.