ETV Bharat / sports

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు- క్రికెటర్​ క్షమాపణ - Dinesh Karthik controversy

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీమ్​ఇండియా సీనియర్​ బ్యాట్స్​మన్​ దినేశ్​ కార్తీక్​(Dinesh Karthik) ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పొరపాటు మరోసారి జరగదని అన్నాడు.

dinesh karthik
దినేశ్​ కార్తిక్​
author img

By

Published : Jul 4, 2021, 8:10 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​తో వ్యాఖ్యాతగా మారిన టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్​మన్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) క్షమాపణలు చెప్పాడు. మహిళలపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఒప్పుకొన్నాడు. ఇంకెప్పుడూ అలా అననని అన్నాడు.

"చివరి మ్యాచ్​లో జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం వేరు. అవి తప్పుగా అర్థమయ్యాయి. నేను అలా అనుకుండా ఉండాల్సింది. అలా మాట్లాడినందుకు మా అమ్మ, భార్య కూడా చీవాట్లు పెట్టారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను." అని ఇంగ్లాండ్, శ్రీలంక (England vs Sri Lanka) మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 20వ ఓవర్​ సమయంలో (ఆదివారం) దినేశ్​ చెప్పాడు.

ఏమి జరిగిందంటే?

ఇటీవలే వ్యాఖ్యాతగా కెరీర్ ఆరంభించి.. న్యూజిలాండ్, టీమ్​ఇండియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్లో(WTC Final) తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న దినేశ్​ కార్తిక్​.. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్, శ్రీలంక (England vs Sri Lanka) మధ్య జరిగిన రెండో వన్డేలో వ్యాఖ్యాతగా ఉన్న అతను.. "బ్యాట్స్​మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేవి రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్​మెన్ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా ఉంటాయి" అని వ్యాఖ్యానించాడు.

దీంతో కార్తీక్​పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. బ్యాట్లను పరాయి పురుషుల భార్యలతో పోల్చి చూడడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.

ఇదీ చూడండి: మహిళలపై కార్తీక్ అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణకు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.