ETV Bharat / sports

కోహ్లీకి తెలియకుండానే టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్? - టీ20 ప్రపంచకప్​పై కోహ్లీ స్పందన

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) టీమ్​ఇండియాకు ధోనీ మెంటార్​గా(Dhoni Mentor) ఉండటం వల్ల యువ ఆటగాళ్లకు ఎంతో లాభం కలుగుతుందని అన్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli News). కాగా, టీ20 ప్రపంచకప్​ అనంతరం భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్​ కోచ్​గా ఉంటాడన్న విషయం తనకు తెలియదని చెప్పాడు.

kohlil, dravid
కోహ్లీ, ద్రవిడ్
author img

By

Published : Oct 16, 2021, 7:20 PM IST

Updated : Oct 16, 2021, 8:38 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా టీమ్​ఇండియాకు మెంటార్​గా ధోనీ(Dhoni Mentor) ఉండటంపై హర్షం వ్యక్తం చేశాడు సారథి కోహ్లీ(Virat Kohli on MS Dhoni). మహీ అనుభవం, అతడు ఇచ్చే సలహాలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయని అన్నాడు.

"ధోనీకి మంచి అనుభవం ఉంది. జట్టు ఆటగాళ్లందరికీ అతడే మెంటార్. మహీ వల్ల యువ ఆటగాళ్లందరికీ ఎంతో లాభం కలుగుతుంది. అతనికి ఉన్న అనుభవం, తాను ఇచ్చే సలహాలతో టీమ్​ఇండియా ఆటతీరు రెట్టింపు అవుతుంది. ప్లేయర్స్​లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది."

--విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

అవగాహన లేదు..

టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ అనంతరం టీమ్​ఇండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్​గా(Dravid New Coach) ఉంటాడన్న విషయంపై తనకు అవగాహన లేదని అన్నాడు కోహ్లీ. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నాడు.

అక్టోబర్​ 17నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టీమ్​ఇండియా తమ తొలి మ్యాచ్​ను అక్టోబర్​ 24న పాకిస్థాన్​తో(Ind vs Pak 2021) ఆడనుంది. ఇక ఈ టోర్నీ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ఇటీవలే ప్రకటించాడు.

అశ్విన్​​ను అందుకే జట్టులోకి..

టీమ్​ఇండియా స్క్వాడ్​లో రవిచంద్రన్​ అశ్విన్​కు చోటు లభించడంపై స్పందించాడు విరాట్ కోహ్లీ. "గత రెండేళ్లుగా ఐపీఎల్​లో అశ్విన్​ మెరుగైన ప్రదర్శన చేశాడు. క్రీజులో హిట్టర్లు ఉన్నా.. డెత్​ ఓవర్లలో అశ్విన్​ బౌలింగ్​తో రాణించాడు. అందుకే టీ20 ప్రపంచకప్​లో అతడిని ఎంపిక చేశాం. అంతర్జాతీయ మ్యాచ్​ల్లో ఆడిన అనుభవం అతడిగి బాగా ఉంది. బౌలింగ్​లో వేరియషన్లు చూపించగల సామర్థ్యం ఉంది" అని అన్నాడు.

అన్ని మ్యాచ్​ల్లానే ఇదీ..
తొలి మ్యాచ్​ పాకిస్థాన్​తో జరగనున్న నేపథ్యంలో "దీని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇది కేవలం గేమ్​ మాత్రమే. ఫ్యాన్​ దృష్టిలోనే ఇది పెద్ద మ్యాచ్​. కానీ, ఆటగాళ్లు.. ఇతర జట్లతో ఆడినట్లే ఈ మ్యాచ్​ కూడా ఆడతారు" అని విరాట్​ చెప్పాడు.

ఇదీ చదవండి:

Dravid coach: టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్.. 2023 ప్రపంచకప్​ వరకు

T20 World Cup 2021: మెగా టోర్నీలో భారత జట్టుదే పైచేయి!

Last Updated : Oct 16, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.