ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమ్ఇండియా, శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లంతా ముందుగా 14 రోజుల క్వారంటైన్లో ఉండనున్నారు. ఇందుకోసం జూన్ 14న వీరంతా సమావేశమై.. అదే రోజున నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి తెలిపారు.
"ఆటగాళ్లు సోమవారం సమావేశమై.. రెగ్యులర్ టెస్టులు చేయించుకుని 14 రోజుల నిర్బంధంలోకి వెళ్లనున్నారు. మొదటి ఏడురోజులు కఠిన క్వారంటైన్, తర్వాతి ఏడు రోజులు సాఫ్ట్ క్వారంటైన్లో(ఇండోర్ ట్రైనింగ్) ఉంటారు. ఆ తర్వాత కొలంబొకు బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక శిక్షణకు ముందు మళ్లీ మూడు రోజుల పాటు జులై 4 వరకు హార్డ్ క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జులై 12వరకు బయోబబుల్‌లో ట్రైనింగ్ అవుతారు. ఇంట్రా స్క్వాడ్ గేమ్స్ ఆడతారు"
-బీసీసీఐ అధికారి.
ఇంట్రా స్క్వాడ్ గేమ్స్
సిరీస్ ప్రారంభానికి ముందు 'లంక ఏ' జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడటానికి శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మన ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి ఓ టీ20, రెండు వన్డేల వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇరు జట్లు మూడు వన్డేలు(జులై 13,16,18), మూడు టీ20లు(21,23,25)వ తేదీల్లో ఆడనున్నాయి. సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, బుమ్రాలతో కూడిన జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో యువ జట్టుతో లంకకు పయనమవనుంది టీమ్ఇండియా.
ఇదీ చూడండి: లంక పర్యటనకు భారత జట్టు ఎంపిక.. ధావన్‌కు కెప్టెన్సీ