ETV Bharat / sports

దీపక్‌ హుడా అరుదైన రికార్డు, అంతర్జాతీయ క్రికెట్​లో తొలి ఆటగాడిగా - దీపక్​ హుడా కొత్త వరల్డ్​ రికార్డ్​

అంతర్జాతీయ క్రికెట్​లో టీమ్​ఇండియా యువప్లేయర్ దీపక్ హుడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే

దీపక్​ హుడా
దీపక్​ హుడా
author img

By

Published : Aug 21, 2022, 10:39 AM IST

Deepak Hooda Record: టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటి జట్టులో స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ మ్యాచ్‌లో హుడా 25 పరుగులు సాధించి, ఒక వికెట్‌ కూడా పడగొట్టి భారత్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ మ్యాచ్‌తో దీపక్ హుడా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. తద్వారా అం‍తర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. హుడా ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, 7 వన్డేల్లో టీమ్​ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

దీపక్​ హుడా
దీపక్​ హుడా

గతంలో ఈ రికార్డు రొమేనియా ప్లేయర్​ సాట్విక్ నడిగోటియా పేరిట ఉండేది. నడిగోటియా అరంగేట్రం చేసిన అనంతరం రొమేనియా 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. తాజా మ్యాచ్‌తో నడిగోటియా రికార్డును హుడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్​ఇండియాను సంజూ శాంసన్, దీపక్ హుడా విజయ తీరాలకు చేర్చారు.

ఇవీ చదవండి: స్కూటీపై స్టార్​ జోడీ షికారు, ఎవరో గుర్తుపట్టండి చూద్దాం

వెకేషన్​లో హార్దిక్ చిల్, బికినీతో హీటెక్కించిన నటాషా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.