ETV Bharat / sports

IPL 2021 news: 'వార్నర్​ను తప్పించడానికి కారణం అది​ కాదు'

ఐపీఎల్​లో వార్నర్​ను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. కనీసం తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో ట్రోల్స్​ వస్తున్న నేపథ్యంలో సన్​రైజర్స్ హైదరాబాద్​ సహాయ కోచ్ బ్రాడ్​ హాడిన్​ దీనిపై స్పందించాడు​. పేలవమైన ప్రదర్శన వల్ల వార్నర్​ను తప్పించారనేది నిజం కాదని అన్నాడు. అందుకు మరో కారణం ఉందని చెప్పాడు.

warner
వార్నర్​
author img

By

Published : Nov 16, 2021, 1:47 PM IST

Updated : Nov 16, 2021, 2:02 PM IST

ఐపీఎల్​లో(warner ipl captaincy) పేలవమైన ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ వార్నర్​.. టీ20 వరల్డ్​కప్​ 2021లో(david warner t20 world cup 2021) అద్భుత ప్రదర్శనతో 'మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్'​ను అందుకుని తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్​లో వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సహా తుది జట్టుకు కూడా దూరంగా ఉంచిన సన్​రైజర్స్​ హైదరాబాద్​పై ట్రోల్స్​ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనిపై స్పందించాడు హైదరాబాద్​ అసిస్టెంట్​​ కోచ్​ బ్రాడ్​ హాడిన్(sunrisers hyderabad assistant coach)​. పేలవమైన ఫామ్​ కారణంగా వార్నర్​ను తప్పించలేదని అన్నాడు. అందుకు మరో కారణం ఉందని చెప్పాడు.

"వార్నర్​ను తప్పించడానికి మరో కారణం ఉంది.​ అతడు ఫామ్​లోనే ఉన్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉన్నాడు. నెట్స్​లో కూడా బాగా ఆడుతున్నాడు. కానీ పరిస్థితులే అతడికి అనుకూలంగా లేవు. చాలాకాలం విరామం తీసుకోవడం వల్ల ​అతడికి మ్యాచ్​ ప్రాక్టీస్​ దూరమైంది. కొన్ని మ్యాచ్​లు ఆడితే మళ్లీ ఫుల్​ఫామ్​లోకి వచ్చేస్తాడు."

- బ్రాడ్​ హాడిన్​(sunrisers hyderabad assistant coach)

చాలా బాధగా ఉంది

"కొన్నేళ్ల పాటు అమితంగా ఇష్టపడిన జట్టు ఉన్నట్టుండి ఏ తప్పూ లేకుండా, ఏ కారణం లేకుండా నన్ను తొలగించడం, కెప్టెన్సీ నుంచి తప్పించడం చేస్తే చాలా బాధగా ఉంది. అయితే, ఈ విషయంపై నేనెలాంటి ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు. భారత్‌లో నాకెంతో మంది అభిమానులున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను ఈ ఆట ఆడుతున్నా. అభిమానులను అలరించడానికే నేను ఉన్నాను. ఎవరైనా మరింత మెరుగవ్వాలనే కోరుకుంటారు. నన్ను తొలగించడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ.. నేను ఆ ఫ్రాంఛైజీ కోసం నిరంతరం కష్టపడ్డా. రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేశా. నెట్స్‌లో బాగా బ్యాటింగ్‌ చేశా. అయితే, సమయానికి పరుగులు చేయలేకపోయా. అలాంటప్పుడు నన్ను తీసేయడం నిజంగానే బాధ కలిగించింది. మరోవైపు నాకింకా ఐపీఎల్‌లో ఆడేందుకు మరో అవకాశం ఉందనే నమ్ముతున్నా" అని వార్నర్‌ తన బాధను చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్​లో వార్నర్​ ప్రదర్శన

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup 2021) ఏడు మ్యాచ్​ల్లో ఆడిన వార్నర్​.. 48 కన్నా ఎక్కువ సగటుతో 289 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్​రేట్​ 146 కన్నా ఎక్కువే. మూడు హాఫ్​ సెంచరీలు నమోదు చేశాడు. సెమీఫైనల్​లో పాకిస్థాన్​పై 49 పరుగులు, ఫైనల్​లో అర్ధసెంచరీ బాది ఆస్ట్రేలియా విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఐపీఎల్​లోనూ(warner ipl stats) ఇప్పటివరకు 150 మ్యాచ్​లు(5449 పరుగులు) ఆడాడు. అందులో నాలుగు సెంచరీలు, 50 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి.

ఇదీచూడండి: 'పంత్​కు భయమంటే తెలియదు.. అతడిలా ఆడతా'

Last Updated : Nov 16, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.