David Warner Net Worth: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గ్రౌండ్లో ఆటతోనే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఇక ఎండార్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్స్లోనూ వార్నర్ రూటే సపరేటు. అయితే దాదాపు 15 ఏళ్లుగా క్రికెట్ కెరీర్లో ఉన్న వార్నర్ అనేక కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. మరి ప్రస్తుతం వార్నర్ వార్షిక ఆదాయం (Annual Income), నెట్ వర్త్ ఎంతో తెలుసా?
కొన్నేళ్లుగా వార్నర్ ఇటు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ అటు వివిధ లీగ్‌ల్లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈక్రమంలో ప్రతీ మ్యాచ్‌కు ఫీజుతో పాటు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వార్షిక వేతనం కూడా చెల్లిస్తుంది. ఇక క్రికెట్ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లోనూ వార్నర్ బాగానే వెనకేసుకున్నాడు. దీంతో వార్నర్ నెట్ వర్త్ వ్యాల్యు (Net Worth Value) సుమారు13 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో రూ.106.60 కోట్లపై మాటే.
అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వార్నర్‌కు ఏడాది జీతం కింద సుమారు రూ.8.4 కోట్ల ఫీజు చెల్లిస్తుంది. ఇది కాకుండా ఫార్మాట్‌ను బట్టి మ్యాచ్ మ్యాచ్‌కు వార్నర్‌కు ఫీజు రూపంలో క్రెడిట్ అవుతుంది. ఇవి కాకుండా డొమెస్టిక్ లీగ్‌ల విషయానికొస్తే, వార్నర్ బిగ్‌బాష్ లీగ్ (Big Bash League), ఐపీఎల్ (Indian Premier League)ల్లోనూ వార్నర్ ఆడుతుంటాడు. ఈ లీగ్‌ల్లో ఆయా ఫ్రాంఛైజీలు కూడా వార్నర్‌కు శాలరీ రూపంలో పెద్ద మొత్తం చెల్లిస్తాయి. ఈ నేపథ్యంలో వార్నర్ కేవలం ఐపీఎల్ నుంచే ఇప్పటివరకు దాదాపు రూ. 83.50 కోట్లు ఆర్జించాడు.
ఇవి కాకుండా సిడ్నీ వార్నర్‌కు విలాసవంతమైన ఇళ్లు ఉంది. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ.66 కోట్లు. దీంతోపాటుగా వార్నర్ గ్యారేజ్‌లో ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. అందులో మెక్‌లారెన్ 570S, లెక్సస్ RX350, లంబోర్గిని (Lamborghini) ఉన్నాయి. ఇక ASICS, LG, DSC, KFC, Channel Nine, Toyota, Make-a-Wish Foundation వంటి కంపెనీలకు వార్నర్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హాలీవుడ్ రేంజ్లో వార్నర్ ఎంట్రీ- గ్రౌండ్‌లోనే హెలికాప్టర్ ల్యాండింగ్