ETV Bharat / sports

ధోనీ కంటే ముందొచ్చారు.. రిటైర్మెంట్​ వద్దంటున్నారు!

author img

By

Published : Jul 12, 2021, 1:11 PM IST

Updated : Jul 12, 2021, 1:59 PM IST

టీమ్ఇండియా క్రికెట్​పై తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇంకొంత కాలం క్రికెట్​లో కొనసాగే సత్తా ఉన్నప్పటికీ.. రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే మహీ కంటే ముందు క్రికెట్​లోకి వచ్చి నేటికీ ఆటలో కొనసాగుతున్న ఆటగాళ్లు కొంతమంది ఉన్నారు. వారెవరో చూద్దాం.

ms dhoni, anderson, chris gayle
ఎంఎస్ ధోనీ, అండర్సన్, క్రిస్ గేల్

మహేంద్ర సింగ్ ధోనీ(40).. కెప్టెన్​గా, వికెట్​ కీపర్​గా, బ్యాట్స్​మన్​గా టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​తో పాటు సుదీర్ఘ ఫార్మాట్​కు గతేడాది రిటైర్మెంట్​ ప్రకటించి.. ప్రస్తుతం ఐపీఎల్​లో మాత్రమే కొనసాగుతున్నాడు. తన నాయకత్వ పటిమతో జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన మహీ.. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించేవాడు. ఇంకా కొంతకాలం క్రికెట్​లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. అనూహ్యంగా వీడ్కోలు చెప్పేశాడు. ఈ నేపథ్యంలో ధోనీ కంటే ముందు క్రికెట్​లోకి వచ్చి నేటికీ రిటైర్మెంట్ ప్రకటించని కొంతమంది ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

cricketers who made their international debut before MS Dhoni and have not retired yet
ధోనీ

దినేష్ కార్తీక్..

టీమ్ఇండియా సీనియర్​ ఆటగాడు​ దినేష్ కార్తీక్(36)​.. ధోనీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్​లోకి వచ్చాడు. ఇద్దరూ బ్యాటింగ్​లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. కానీ, మహీ వచ్చిన తర్వాత కీపింగ్​లో తనదైన మార్క్​ చూపించాడు. దీంతో కార్తీక్​ కంటే ఎక్కువగా ధోనీ విజయవంతమయ్యాడు.

దినేష్ కార్తీక్

2004 సెప్టెంబర్​ 5న లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో కార్తీక్ టీమ్​ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. 26 టెస్టులతో పాటు 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. కానీ, ఇప్పటికీ తన క్రికెట్ కెరీర్​కు వీడ్కోలు చెప్పలేదు దినేష్. ప్రస్తుతం తమిళనాడు తరఫున రంజీల్లో ఆడుతున్నాడు. అలాగే ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్​తో కామెంటేటర్ అవతారమెత్తి విజయవంతమయ్యాడు. కానీ త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియాకు ఆడాలని ఉందని చాలాసార్లు చెప్పాడు.

కమ్రాన్ అక్మల్..

పాకిస్థాన్ సీనియర్​ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్​ కమ్రాన్ అక్మల్(39) ఇప్పటికీ రిటైర్​మెంట్ ప్రకటించలేదు. 2002లో సుదీర్ఘ ఫార్మాట్​తో పాటు వన్డేల్లో అరంగేట్రం చేశాడీ పాక్ క్రికెటర్. 19 ఏళ్ల తన క్రికెట్ జీవితంలో 53 టెస్టులతో పాటు 157 వన్డేలు, 58 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

2017 నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్న అక్మల్.. ఆటకు వీడ్కోలు మాత్రం చెప్పలేదు. కానీ, పాకిస్థాన్ సూపర్ లీగ్​లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నాడు. జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు.

ఇదీ చదవండి: ICC: 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​' విజేతలు వీరే

మహ్మద్ హఫీజ్..

అక్మల్ సహచరుడు హఫీజ్​(40).. ఈ ఏడాదితో 41వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. టీ20ల్లో తనదైన మార్క్​ చూపించిన ఈ మాజీ కెప్టెన్.. తిరిగి జాతీయ జట్టుకు ఆడాలనే ఆశతో ఉన్నాడు.

2003లో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడిన హఫీజ్​.. 2020 సీజన్​లో పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. రానున్న టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​ జట్టులో చోటు దక్కుతుందేమోనని ఎదురుచూస్తున్నాడు.

షోయబ్ మాలిక్..

పాకిస్థాన్ వెటరన్ ఆల్​రౌండర్​ షోయబ్​ మాలిక్(39).. 2007 టీ20 ప్రపంచకప్​ సమయంలో ఆ దేశ కెప్టెన్​గా వ్యవహరించాడు. జట్టులోకి వచ్చే అవకాశం లేనప్పటికీ.. ఆటకు మాత్రం గుడ్​బై చెప్పలేదు.

జేమ్స్​ అండర్సన్..

ఇంగ్లాండ్ తరఫున ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో 1000 వికెట్లు తీసిన బౌలర్​గా​ జేమ్స్​ అండర్సన్(38) సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోనీ లాగే అండర్సన్​ కూడా ఫిట్​నెస్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే ఇంకా క్రికెట్​లో కొనసాగుతున్నాడు.

అండర్సన్

2002లో తన తొలి వన్డే మ్యాచ్​ ఆడిన అండర్సన్.. ప్రస్తుతం కేవలం సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. టీమ్ఇండియాతో వచ్చే నెల నుంచి జరగనున్న టెస్టు సిరీస్​లో ఈ సీనియర్​ బౌలర్​కు చోటు కచ్చితంగా ఉంటుంది.

డ్వేన్ బ్రావో..

డ్వేన్ బ్రేవో

ధోనీ ఐపీఎల్​ సహచరుడు, విండీస్​ ఆల్​రౌండర్​ డ్వేన్ బ్రావో(37).. ఇప్పటికీ క్రికెట్లో విజయవంతంగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో బ్రావో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. ధోనీ కంటే కొన్ని నెలల ముందు క్రికెట్​లోకి అడుగుపెట్టిన ఈ విండీస్ వీరుడు.. టెస్టులతో పాటు వన్డేలకు గుడ్​బై చెప్పాడు. టీ20ల్లో ఆడుతున్నాడు.

ఇదీ చదవండి: IND vs PAK: 'ఒత్తిడిని ఎదుర్కోవాలంటే భారత్‌తో ఆడాలి'

క్రిస్​ గేల్..

క్రిస్ గేల్

యూనివర్సల్​ బాస్​ క్రిస్​ గేల్(41) 1999లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ బ్యాట్స్​మన్​గా రాణిస్తున్నాడు. రానున్న టీ20 ప్రపంచకప్​లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

హర్భజన్ సింగ్..

ధోనీ సహచరుడు భజ్జీ(41).. 1998లో అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2016 వరకు టీమ్ఇండియా స్పిన్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న హర్భజన్.. ప్రస్తుతం ఐపీఎల్​లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటికీ జాతీయ జట్టులో చోటు లభిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు.

హర్భజన్ సింగ్

ఐపీఎల్​ 14వ సీజన్​ మినీ వేలంలో తొలి విడతలో భజ్జీని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. రెండో విడతలో కోల్​కతా నైట్ రైడర్స్​ ఇతడిని జట్టులోకి తీసుకుంది.

అమిత్ మిశ్రా..

ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్​ ఎవరంటే అమిత్ మిశ్రా(38) అనే చెప్పాలి. 2003లో దక్షిణాఫ్రికాపై తన తొలి మ్యాచ్​ ఆడిన ఈ స్పిన్నర్.. ప్రస్తుతం ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడుతున్నాడు. భజ్జీ లాగే మిశ్రా కూడా జాతీయ జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఫిడెల్​ ఎడ్వర్డ్స్​..

కరీబియన్ పేసర్​ ఫిడెల్​ ఎడ్వర్డ్స్(39)​.. 2003లో క్రికెట్​లోకి వచ్చాడు. విండీస్​ తరఫున 55 టెస్టులతో పాటు 50 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. రానున్న టీ20 ప్రపంచకప్​లో ఈ బౌలర్​కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కోహ్లీ తనయ వామిక ఫొటోలు వైరల్.. మీరూ చూసేయండి

Last Updated : Jul 12, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.