ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జరగబోయే ప్రపంచకప్‌లో భారత్ సత్తాచాటుతుందని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆకాంక్షించాడు. జట్టు సమతూకంగా ఉందని, కప్పు గెలవకపోతే నిరుత్సహాపడాల్సి వస్తుందని తెలిపాడు. రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టుకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు.
99 టెస్టులాడిన అజారుద్దీన్ 3 ప్రపంచకప్ టోర్నీల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1992, 1996, 1999లో జరిగిన మెగాటోర్నీల్లో ఆడాడు. కోహ్లీ ఐపీఎల్ ప్రదర్శన ప్రపంచకప్‌పై ప్రభావం చూపదని ఆశిస్తున్నాడీ మాజీ సారథి.