ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది వెస్టిండీస్. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని అఫ్గానిస్థాన్ విజయంతో టోర్నీని ముగిద్దామనుకుంటోంది. ఈ రెండింటి మధ్య హెడింగ్లే వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పసికూనపై పరాక్రమం చూపించేనా..
-
It's the final match for the #MenInMaroon in our #CWC19 campaign! Set your ⏰ and #rally once more!🙌🏾 #AFGvWI #CWC19
— Windies Cricket (@windiescricket) July 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
📺: @espncaribbean
📲: https://t.co/6TUKc2hD7J pic.twitter.com/GlnWDwgFHq
">It's the final match for the #MenInMaroon in our #CWC19 campaign! Set your ⏰ and #rally once more!🙌🏾 #AFGvWI #CWC19
— Windies Cricket (@windiescricket) July 3, 2019
📺: @espncaribbean
📲: https://t.co/6TUKc2hD7J pic.twitter.com/GlnWDwgFHqIt's the final match for the #MenInMaroon in our #CWC19 campaign! Set your ⏰ and #rally once more!🙌🏾 #AFGvWI #CWC19
— Windies Cricket (@windiescricket) July 3, 2019
📺: @espncaribbean
📲: https://t.co/6TUKc2hD7J pic.twitter.com/GlnWDwgFHq
ఒక్క మ్యాచ్‌లోనే గెలిచిన వెస్టిండీస్ 3 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. క్రిస్ గేల్, హోప్, బ్రాత్‌వైట్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
రసెల్ జట్టుకు దూరం కావడం విండీస్‌కు కోలుకోలేని దెబ్బ. తొలి రెండు ప్రపంచకప్‌లలో ఛాంపియన్లుగా నిలిచిన వెస్టిండీస్ మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చేతులెత్తేస్తోంది.
ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్‌తో మినహా మిగతా జట్లపై పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో చివరి వరకు పోరాడి త్రుటిలో విజయం చేజార్చుకుంది. పేరుకు విధ్వంసకారులున్నా.. సమష్టిగా ఆడటంలో కరీబియన్ జట్టు విఫలమైంది. బౌలింగ్‌లో కాట్రెల్, థామస్ లాంటి వారు ఆకట్టుకుంటున్నా..నిలకడ లోపిస్తోంది. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
ప్రపంచకప్‌లో విజయాన్ని అందుకునేనా..
-
Team Afghanistan will face @windiescricket in their last match of the ICC @cricketworldcup 2019 at Headingley, Leeds tomorrow at 2PM AFT.#AFGvWI #CWC19 #AfghanAtalan pic.twitter.com/jp3JjSW86f
— Afghanistan Cricket Board (@ACBofficials) July 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team Afghanistan will face @windiescricket in their last match of the ICC @cricketworldcup 2019 at Headingley, Leeds tomorrow at 2PM AFT.#AFGvWI #CWC19 #AfghanAtalan pic.twitter.com/jp3JjSW86f
— Afghanistan Cricket Board (@ACBofficials) July 3, 2019Team Afghanistan will face @windiescricket in their last match of the ICC @cricketworldcup 2019 at Headingley, Leeds tomorrow at 2PM AFT.#AFGvWI #CWC19 #AfghanAtalan pic.twitter.com/jp3JjSW86f
— Afghanistan Cricket Board (@ACBofficials) July 3, 2019
మరోవైపు అఫ్గాన్ ఈ ప్రపంచకప్‌లో చక్కటి పోరాటపటిమ చూపింది. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకున్నా.. తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రియుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచుల్లో చివరి వరకూ పోరాడి ఓడింది.
బ్యాటింగ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. నైబ్, నబీ, నజీబుల్లా మినహా ఎవరూ పెద్దగా రాణించట్లేదు. బౌలింగ్‌లో మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, రషీద్ ఖాన్ లాంటి ప్రతిభావంతులైన బౌలర్లు ఆ జట్టు సొంతం.
గతేడాది జరిగిన ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో విండీస్‌ను ఓడించిన అఫ్గాన్.. అదే సీన్ పునరావృతం చేయాలనుకుంటోంది. మరోసారి స్పిన్నర్లపైనే ఆధారపడనుంది అఫ్గానిస్థాన్. ఈ మ్యాచ్‌లో విండీస్‌పై గెలిచి 2019 వరల్డ్‌కప్ టోర్నీని ముగిద్దామనుకుంటోంది.
ఇది చదవండి: సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్.. కివీస్‌పై భారీ విజయం