ప్రపంచకప్‌లో టాంటన్ వేదికగా బంగ్లాతో జరిగిన పోరులో కరీబియన్లు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచారు. హోప్ తృటిలో శతకం మిస్సవ్వగా... లూయిస్, హిట్మైర్ అర్ధశతకాలు చేశారు. మిడిలార్డర్లో వచ్చిన పూరన్, జాసన్ హోల్డర్ బ్యాట్ ఝులిపించారు. హార్డ్ హిట్టర్లు క్రిస్ గేల్, రసెల్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఫలితంగా 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది వెస్టిండీస్.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్టర్ గేల్ 13 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత జోరు తగ్గిన విండీస్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు హోప్.
హోప్ రక్షించాడు..
ఓపెనర్ గేల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ నెమ్మదిగా పరుగులు రాబట్టి 121 బంతుల్లో 96 పరుగులు( 4 ఫోర్లు, సిక్స్) సాధించాడు. చెత్త షాట్ ఆడి తృటిలో శతకం చేజార్చుకున్న హోప్... వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో కీలకంగా నిలిచాడు. అవతలి ఎండ్‌లో ఆటగాళ్లు వచ్చి వెంటనే పెవిలియన్ చేరుతున్నా... క్రీజులో పాగా వేసి మంచి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ ప్రపంచకప్‌లో రెండో సారి 50 పరుగుల వ్యక్తిగత మార్కు దాటాడు. ఫలితంగా బంగ్లాకు 322 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు.
-
Bangladesh need 322 runs to win against @windiescricket in the 23rd match of @cricketworldcup 2019.#CWC19 #RiseOfTheTigers#BANvWI #KhelbeTigerJitbeTiger
— Bangladesh Cricket (@BCBtigers) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
WATCH all the WORLD CUP 2019 Matches LIVE for Free!
Visit : https://t.co/WZBeMEDq5Z (Only for Bangladesh) pic.twitter.com/xV6gClkK1r
">Bangladesh need 322 runs to win against @windiescricket in the 23rd match of @cricketworldcup 2019.#CWC19 #RiseOfTheTigers#BANvWI #KhelbeTigerJitbeTiger
— Bangladesh Cricket (@BCBtigers) June 17, 2019
WATCH all the WORLD CUP 2019 Matches LIVE for Free!
Visit : https://t.co/WZBeMEDq5Z (Only for Bangladesh) pic.twitter.com/xV6gClkK1rBangladesh need 322 runs to win against @windiescricket in the 23rd match of @cricketworldcup 2019.#CWC19 #RiseOfTheTigers#BANvWI #KhelbeTigerJitbeTiger
— Bangladesh Cricket (@BCBtigers) June 17, 2019
WATCH all the WORLD CUP 2019 Matches LIVE for Free!
Visit : https://t.co/WZBeMEDq5Z (Only for Bangladesh) pic.twitter.com/xV6gClkK1r
బోర్డర్లు దాటిన సిక్సర్లు...
ప్రపంచకప్‌లో హిట్మైర్, హోల్టర్ కొట్టిన సిక్సులు ఇప్పటివరకు ఉన్న రికార్డులను తుడిపేశాయి. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రసెల్ పేరిట 103 మీటర్ల దూరం సిక్స్ ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టారు ఆ దేశ బ్యాట్స్మెన్లు. మొదట హిట్మైర్ 104 మీటర్ల దూరం సిక్స్ కొడితే... ఇదే మ్యాచ్‌లో హోల్డర్ 105 మీటర్ల సిక్సు బాదాడు.
-
And Holder goes even bigger!#JasonHolder hits a 105-metre maximum a few overs later!#CWC19 | #WIvBAN https://t.co/k1yfzj4rwu
— ICC (@ICC) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And Holder goes even bigger!#JasonHolder hits a 105-metre maximum a few overs later!#CWC19 | #WIvBAN https://t.co/k1yfzj4rwu
— ICC (@ICC) June 17, 2019And Holder goes even bigger!#JasonHolder hits a 105-metre maximum a few overs later!#CWC19 | #WIvBAN https://t.co/k1yfzj4rwu
— ICC (@ICC) June 17, 2019
హిట్మైర్ జోరు...వేగవంతమైన అర్ధశతకం
ఈ మ్యాచ్‌లో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు విండీస్ ఆల్‌రౌండర్ హిట్మైర్. కేవలం 25 బంతుల్లోనే ఈ వరల్డ్‌కప్‌లో వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ క్యారీ కూడా ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఇది రెండో వేగవంతమైన అర్ధశతకం. కరీబియన్ల తరఫున వేయి పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా ఘనత సాధించాడు.
-
🌴v🇧🇩
— Windies Cricket (@windiescricket) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
2nd fastest Half Century in a World Cup & 4th fastest to 1000 ODI Runs for the West Indies! 🏏🔥#cwc19 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/4OPEFYeUrr
">🌴v🇧🇩
— Windies Cricket (@windiescricket) June 17, 2019
2nd fastest Half Century in a World Cup & 4th fastest to 1000 ODI Runs for the West Indies! 🏏🔥#cwc19 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/4OPEFYeUrr🌴v🇧🇩
— Windies Cricket (@windiescricket) June 17, 2019
2nd fastest Half Century in a World Cup & 4th fastest to 1000 ODI Runs for the West Indies! 🏏🔥#cwc19 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/4OPEFYeUrr
గేల్, రసెల్ తుస్...
వెస్టిండీస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విధ్వంసకర బ్యాట్స్మెన్లు గేల్, రసెల్ తుస్సుమనిపించారు. వీరిద్దరూ డకౌట్‌గా వెనుదిరిగిన సమయంలో కరీబియన్లు తీవ్రంగా నిరాశ చెందారు.
బంగ్లా బౌలర్లలో సైఫుద్ధీన్, ముస్తాఫిజుర్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు.