ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క విజయం నమోదు చేసిన వెస్టిండీస్ ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించింది. అలాగే టీమిండియాపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో శ్రీలంకకు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం అయింది. ఈ రెండింటి మధ్య చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
లంక నిలవాలంటే గెలవాల్సిందే...
అఫ్గాన్, ఇంగ్లాండ్ మినహా మిగతా జట్లపై పరాజయం చెందిన శ్రీలంక సెమీస్ చేరడం ఎంతో కష్టం. ఏడు మ్యాచ్‌లు ఆడిన లంక జట్టు... మిగిలిన రెండింటిలో భారీ విజయం సాధించాలి. ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తాము ఆడాల్సిన మ్యాచుల్లో భారీ తేడాతో పరాజయం చెందితే తప్ప శ్రీలంకకు అవకాశం ఉండదు. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో గెలిచినట్లయితే లంకేయులకు సెమీస్ అవకాశం ఇంత కష్టంగా ఉండేది కాదు. కానీ అందులో ఓడిపోయింది.
ఈ ప్రపంచకప్‌లో లంక అంతగా రాణించలేదు. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవడం ఆ జట్టుకు కలిసొచ్చింది. బ్యాటింగ్‌లో కరుణరత్నే, కుశాల్ పెరీరా, అవిష్కా ఫెర్నాండో, మ్యాథ్యూస్ మినహా ఈ టోర్నీలో మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్‌లో ఓ మోస్తరుగా రాణించింది. అది కూడా మలింగ లాంటి స్టార్ పేసర్ ఉండటమే. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ప్రస్తుతం విండీస్‌పై సత్తాచాటి సెమీస్ చేరేందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది లంక.
-
It's been a tough tournament but the #MenInMaroon still need our support!💪🏽 Set your ⏰ & #Rally once more!🙌🏾 #WIvSL #CWC19 .
— Windies Cricket (@windiescricket) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
📺: @espncaribbean
📲: https://t.co/6TUKc2hD7J pic.twitter.com/PxftwOADDr
">It's been a tough tournament but the #MenInMaroon still need our support!💪🏽 Set your ⏰ & #Rally once more!🙌🏾 #WIvSL #CWC19 .
— Windies Cricket (@windiescricket) June 29, 2019
📺: @espncaribbean
📲: https://t.co/6TUKc2hD7J pic.twitter.com/PxftwOADDrIt's been a tough tournament but the #MenInMaroon still need our support!💪🏽 Set your ⏰ & #Rally once more!🙌🏾 #WIvSL #CWC19 .
— Windies Cricket (@windiescricket) June 29, 2019
📺: @espncaribbean
📲: https://t.co/6TUKc2hD7J pic.twitter.com/PxftwOADDr
పరువు కోసం విండీస్ ఆరాటం..
"పేరు గొప్ప.. ఊరు దిబ్బ" అన్నట్టుగా ఉంది వెస్టిండీస్ పరిస్థితి. పేరుకు క్రిస్ గేల్, షాయ్ హోప్, బ్రాత్ వైట్, హెట్మెయిర్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాకిస్థాన్‌పై గెలిచింది. కానీ మిగతా మ్యాచ్‌లన్నింటిలోనూ పరాజయం చెందింది. ఆ మ్యాచ్‌లోనూ బౌలర్ల విజృంభణతో గెలుపు సొంతం చేసుకోగలిగింది. గత మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేక 143 పరుగులతే చతికిలపడింది.
సమష్టిగా రాణిచడంలో విఫలమవడం, నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ లేకపోవడం లాంటి కారణాలతో సెమీస్ నుంచి నిష్క్రమించింది కరీబియన్. గాయం కారణంగా రసెల్ టోర్నీ మధ్యలోనే తప్పుకోవడం విండీస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈ ప్రతికూలాలను అధిగమించి శ్రీలంకపై గెలిచి పరువు కాపాడాలనుకుంటోంది విండీస్ జట్టు.
ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు ఆరు సార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచుల్లో వెస్టిండీస్ గెలవగా... రెండింటిలో మాత్రమే శ్రీలంక నెగ్గింది.
ఇది చదవండి: చాహల్ ఖాతాలో చెత్త రికార్డు..