ETV Bharat / sports

WC 19: మాస్టర్​ బ్లాస్టర్​ మైక్​ పడితే...

ప్రపంచకప్​ ఆరంభ మ్యాచ్​కు సచిన్ తెందూల్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ రోజు 3 గంటలకు లండన్ కెన్నింగ్టన్ వేదికగా సౌతాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్​ జరగనుంది.

author img

By

Published : May 30, 2019, 12:34 PM IST

Updated : May 30, 2019, 1:29 PM IST

సచిన్

బ్యాటింగ్​తో ఆకట్టుకున్న మాస్టర్​ బ్లాస్టర్ సచిన్​తెందూల్కర్ తన గొంతు సవరించుకోనున్నాడు​. ప్రపంచకప్​లో ఈ రోజు తలపడబోతున్న ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా ఆరంభ మ్యాచ్​లో వ్యాఖ్యాతగా మారనున్నాడు. కామెంటేటర్​గా సచిన్​కిదే తొలి మ్యాచ్​.

మ్యాచ్​ ముందు నిర్వహించే 'సచిన్ ఓపెన్ ఎగైన్' కార్యక్రమంలో పాల్గొననున్నాడు మాస్టర్​. సంబంధిత ప్యానెల్ సభ్యులతో కలవనున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రీ షో ప్రారంభంకానుంది.

ఆరు ప్రపంచకప్​ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించిన తెందూల్కర్ మెగాటోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2003 వరల్డ్​కప్​లో 673 పరుగులు చేసి ఆ సీజన్ మ్యాన్ ఆఫ్​ ద టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు.

ఈ ప్రపంచకప్​లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా. జులై 14న తుదిపోరు జరగనుంది. 12వ ప్రపంచకప్​ సీజన్​లో 46 రోజులపాటు 48 మ్యాచ్​లు జరగనున్నాయి. ఇందులో 10 జట్లు పాల్గొననున్నాయి.

ఇది చదవండి : WC19: భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం

Intro:Body:Conclusion:
Last Updated : May 30, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.