ఆస్ట్రేలియాపై అద్భుత శతకం చేసి ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా ఓపెనర్ ధావన్ వేలికి గాయమైంది. కౌల్టర్‌నైల్ విసిరిన బంతి శిఖర్ చేతికి బలంగా తాకింది. అయితే ఈ గాయానికి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ముందు స్కానింగ్ చేయించనున్నారు.
గాయం వల్ల ధావన్ ఆసీస్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేశాడు. స్కానింగ్‌లో తేలే విషయాన్ని బట్టి గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు గబ్బర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలుస్తుంది. ధావన్‌కు ఎలాంటి గాయం కాకూడదని జట్టుతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి.. యువీ హార్ట్ టచింగ్ వీడియో!