భారత ప్రపంచకప్ జట్టులో యువ క్రికెటర్ రిషభ్ పంత్ చేరనున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటం వల్ల ముందు జాగ్రత్తగా పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
గురువారం భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు పంత్ జట్టులో చేరనున్నాడు. ధావన్‌పై జట్టు మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకునే వరకు అతడి స్థానంలో పంత్ ఆడబోడని బీసీసీఐ స్పష్టం చేసింది. ధావన్ ప్రస్తుతం జట్టు ఫిజియోల పర్యవేక్షణలో ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. ఈ నేపథ్యంలో ధావన్ కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
21 ఏళ్ల వికెట్ కీపర్‌కు 15 సభ్యుల ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
2018లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆకట్టుకున్న పంత్... సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ధావన్ ఆడలేని తరుణంలో రిషభ్ పంత్‌ను ఎంపిక చేయాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సహా పలువురు సూచించారు.