ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు పాకిస్థాన్​ షాక్​​​- ఉత్కంఠ పోరులో గెలుపు - england

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ బట్లర్, రూట్ శతకాలతో చెలరేగినా మ్యాచ్​ను గెలిపించలేకపోయారు. పాక్ బౌలర్లు వాహబ్ రియాజ్ 3 వికెట్లతో రాణించగా.. షాదాబ్ ఖాన్, అమీర్​ చెరో 2 వికెట్లతో ఆకట్టుకున్నారు.

పాకిస్థాన్
author img

By

Published : Jun 3, 2019, 11:42 PM IST

Updated : Jun 5, 2019, 1:12 AM IST

ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించింది పాకిస్థాన్. హఫీజ్‌ (84; 62 బంతుల్లో 8×4, 2×6), బాబర్‌ అజామ్‌ (63; 66 బంతుల్లో 4×4, 1×6), సర్ఫ్‌రాజ్‌ (55; 44 బంతుల్లో 5×4) మెరవడంతో మొదట పాకిస్థాన్‌ 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. ఛేదనలో రూట్‌ (107; 104 బంతుల్లో 10×4, 1×6), బట్లర్‌ (103; 76 బంతుల్లో 9×4, 2×6) సెంచరీలు కొట్టినా.. ఇంగ్లాండ్‌ 9 వికెట్లకు 334 పరుగులే చేయగలిగింది. బంతితోనూ రాణించిన హఫీజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.

349 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. జేసన్​ రాయ్ (8)ను షాదాబ్​ ఖాన్ ఔట్ చేశాడు. అనంతరం బెయిర్ స్టో (32) - జో రూట్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

కుదురుకునే సమయంలోనే బెయిర్​ స్టోను ఔట్ చేసి ఇంగ్లాండ్​ను దెబ్బతీశాడు వాహబ్​​ రియాజ్​. కాసేపటికే మోర్గాన్​ను (9) కూడా పెవిలియన్ చేర్చాడు హఫీజ్​. అనంతరం బ్యాటింగ్​కొచ్చిన బెన్ స్టోక్స్ ​(13) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

బట్లర్, రూట్ శతకాలు

తర్వాత బ్యాటింగ్​ కొచ్చిన బట్లర్ పత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రూట్​తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హొరెత్తించారు. రూట్ 97 బంతుల్లో సెంచరీ చేయగా.. బట్లర్ 75 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. వీరిద్దరూ ఉన్నంతసేపు గెలుపు ఖాయమనే అనుకున్నారు ఇంగ్లీష్ జట్టు అభిమానులు.

చివర్లో మలుపు తిప్పిన పాక్ బౌలర్లు

రూట్​ను ఔట్ చేసి ఇంగ్లాండ్​ను దెబ్బతీశాడు షాదాబ్ ఖాన్. కాసేపటికే బట్లర్​ను ఔట్​ చేసి మ్యాచ్​ను మలుపుతిప్పాడు అమీర్. అనంతరం మ్యాచ్ పాకిస్థాన్ వైపు మొగ్గింది. వేగంగా పరుగులు చేయటంలో ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ ఇబ్బంది పడ్డారు. 48వ ఓవర్ వేసిన వహాబ్ రియాజ్ ఒకే ఓవర్​లో మొయిన్ అలీని (19), క్రిస్ వోక్స్​ను (21) ఔట్ చేసి పాకిస్థాన్​కు గెలుపు ఖాయం చేశాడు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో హఫీజ్, బాబర్ అజామ్, సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ వోక్స్​, మొయిన్ అలీ చెరో 3 వికెట్లు తీయగా... మార్క్​వుడ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
2100
NEW YORK_ Shailene Woodley teases season two of 'Big Little Lies,' talks working with Meryl Streep.
TUESDAY 4 JUNE
0700
NEW YORK_ Highlights from the CFDA Awards honoring Carine Roitfeld, Bob Mackie, Jennifer Lopez and Barbie.
LOS ANGELES_ On the heels of a blazing comeback with the chart-topping single 'Sucker' and its witty follow-up 'Cool,' along comes the new Jonas Brothers documentary 'Chasing Happiness.'   
0900
WEST HOLLYWOOD_ Ron Howard makes the musical leap from The Fab Four to The Three Tenors with his latest documentary, 'Pavarotti.'
COMING UP ON CELEBRITY EXTRA
NASHVILLE_ Country artists Hunter Hayes, Ingrid Andress, Brett Eldredge and Chase Rice think back to the first record they took home.
LOS ANGELES_ Sugar Ray Leonard: 'I don't want to be known as a fighter who beat people up.'
LOS ANGELES_ Rapper, singer and record producer Pitbull shares the secrets to his success.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
AP FACT CHECK: Trump denies calling Duchess Meghan 'nasty'.
ARCHIVE_ Groping case against actor Kevin Spacey returns to court.
NANTUCKET_ Kevin Spacey arrives for hearing in groping case.
LONDON_ Chris Hemsworth's kids are 'unimpressed' with dad's superhero antics.
DETROIT_ Aly and AJ hit road with new EP during acting break.
CELEBRITY EXTRA
WORLD_ Yungen, Leon Bridges and Giorgio Moroder reveal their first record purchases.
LOS ANGELES_ 'Godzilla' stars Millie Bobby Brown, Kyle Chandler remember their first movie monsters.
BEVERLY HILLS_ Composer Alan Menken's secrets to modernizing 'Aladdin' tunes.
Last Updated : Jun 5, 2019, 1:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.