ఓవల్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. 245 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బంగ్లా గట్టిగా పోరాడింది. అయితే రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ మంచి ఇన్నింగ్స్ ఆడటం వల్ల ఓటమిపాలైంది. చివరి వరకు ఊగిసలాడిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది కివీస్.
టేలర్ పోరాటం...
బంగ్లాదేశ్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. గప్తిల్, మున్రో మంచి ఆరంభాన్నిచ్చినా పెద్ద భాగస్వామ్యం నమోదు చేయలేకపోయారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 40 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఓ దశలో 162 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను రాస్ టేలర్ 82 ( 91 బంతుల్లో; 9 ఫోర్లు) గట్టెక్కించి.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే టేలర్ వెనుదిరిగాక మ్యాచ్‌పై బంగ్లా పట్టు బిగించింది. చివర్లో శాంట్నర్ (17) బాధ్యతాయుతంగా ఆడి కివీస్‌ను గెలిపించాడు.
-
New Zealand hold on and win by two wickets!
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A brilliant game of cricket. pic.twitter.com/mrjITaei6k
">New Zealand hold on and win by two wickets!
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
A brilliant game of cricket. pic.twitter.com/mrjITaei6kNew Zealand hold on and win by two wickets!
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019
A brilliant game of cricket. pic.twitter.com/mrjITaei6k
బంగ్లా బౌలర్లలో షకీబుల్, మెహదీ హసన్, సైఫుద్దీన్, మొసాదిక్ హుసేన్ చెరో వికెట్లు తీసుకున్నారు.
షకీబ్ అర్ధశతకం వృథా...
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. ఇన్నింగ్స్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (24), సౌమ్య సర్కార్ (25) తొలి వికెట్‌కు 45 పరుగులు జత చేసి శుభారంభం అందించారు. అయితే హెన్రీ, బౌల్ట్ (2/44) విజృంభించడం వల్ల బంగ్లా స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ రహీం (19) కూడా ఎక్కువసేపు నిలవకపోవడం వల్ల బంగ్లా 110/3తో ఇబ్బందుల్లో పడింది.
-
Bangladesh lost their second match in ICC Cricket World Cup 2019 against New Zealand by 2 wickets at The Oval.
— Bangladesh Cricket (@BCBtigers) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#CWC19 #RiseOfTheTigers #BANvNZ pic.twitter.com/7FePlKql0T
">Bangladesh lost their second match in ICC Cricket World Cup 2019 against New Zealand by 2 wickets at The Oval.
— Bangladesh Cricket (@BCBtigers) June 5, 2019
#CWC19 #RiseOfTheTigers #BANvNZ pic.twitter.com/7FePlKql0TBangladesh lost their second match in ICC Cricket World Cup 2019 against New Zealand by 2 wickets at The Oval.
— Bangladesh Cricket (@BCBtigers) June 5, 2019
#CWC19 #RiseOfTheTigers #BANvNZ pic.twitter.com/7FePlKql0T
ఈ స్థితిలో షకీబుల్ హసన్ (64).. మిథున్ (26)తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 41 పరుగుల జత చేయడం వల్ల బంగ్లా కోలుకుంది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న షకీబ్.. 54 బంతుల్లో ఈ టోర్నీలో వరుసగా రెండో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఒక దశలో బంగ్లా 151/3తో మెరుగ్గా నిలిచింది. అయితే షకీబ్‌ను గ్రాండ్‌హోమ్ ఔట్ చేయడం వల్ల బంగ్లాకు ఎదురుదెబ్బ తగిలింది. మహ్మదుల్లా (20)తో పాటు చివర్లలో సైఫుద్దీన్ (29; 23 బంతుల్లో 3×4, 1×6) పోరాడటం వల్ల బంగ్లా పోరాడే స్కోరు చేయగలిగింది.
-
5⃣0⃣! @Sah75official brings up his 44th fifty in ODIs.#CWC19 #RiseOfTheTigers #BANvSA
— Bangladesh Cricket (@BCBtigers) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
WATCH all the WORLD CUP 2019 Matches LIVE for Free!
Visit : https://t.co/WZBeMEDq5Z (Only for Bangladesh) pic.twitter.com/RfrbRH82dn
">5⃣0⃣! @Sah75official brings up his 44th fifty in ODIs.#CWC19 #RiseOfTheTigers #BANvSA
— Bangladesh Cricket (@BCBtigers) June 5, 2019
WATCH all the WORLD CUP 2019 Matches LIVE for Free!
Visit : https://t.co/WZBeMEDq5Z (Only for Bangladesh) pic.twitter.com/RfrbRH82dn5⃣0⃣! @Sah75official brings up his 44th fifty in ODIs.#CWC19 #RiseOfTheTigers #BANvSA
— Bangladesh Cricket (@BCBtigers) June 5, 2019
WATCH all the WORLD CUP 2019 Matches LIVE for Free!
Visit : https://t.co/WZBeMEDq5Z (Only for Bangladesh) pic.twitter.com/RfrbRH82dn
కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో రాణించగా.. బౌల్ట్ రెండు.. ఫెర్గ్యూసన్, గ్రాండ్‌హోమ్, మిషెల్ సాంట్నర్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.