ETV Bharat / sports

WC19: అఫ్గాన్​పై ఆడుతూ పాడుతూ కివీస్​ గెలుపు

టాంటన్ వేదికగా అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని 32.1 ఓవర్లలోనే ఛేదించేసింది కివీస్​ జట్టు. ఫలితంగా వరుసగా హ్యాట్రిక్​ ఓటములు మూటగట్టుకుంది అఫ్గాన్​. 5 వికెట్లతో చెలరేగిన కివీస్​ బౌలర్​ నీషమ్​కు 'మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్'​ దక్కింది.

WC19: అఫ్గాన్​పై ఆడుతూ పాడుతూ కివీస్​ గెలుపు
author img

By

Published : Jun 9, 2019, 1:57 AM IST

Updated : Jun 9, 2019, 11:59 PM IST

ప్రపంచకప్​లో మంచి ప్రదర్శన చేయాలని ఆశ పడిన అఫ్గాన్​ జట్టు హ్యాట్రిక్​ ఓటములు చవిచూసింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో పరాభవాన్ని ఎదుర్కొన్న ఈ పసికూన... శనివారం న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఓటమిపాలైంది. ముందుగా న్యూజిలాండ్​ పేస్​ బౌలర్ల ధాటికి అఫ్గాన్ 172 పరుగులకే కుప్పకూలింది. స్పల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ అలవోకగా ఛేదించింది.

అలవోకగా ఛేదన...

173 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​ జట్టు... 32.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. న్యూజిలాండ్​ బ్యాట్స్​మెన్లలో కేన్​ విలియమ్సన్​ 79 పరుగుల (99 బంతుల్లో; 9 ఫోర్లు)తో నాటౌట్​గా నిలిచాడు. రాస్​ టేలర్​ 48 పరుగులు (52 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్స్​) చేసి మరోసారి మంచి ఇన్నింగ్స్​ ఆడాడు.

అఫ్గాన్​ బౌలర్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. అప్తాబ్​ అలమ్​ 3 వికెట్లు తీశాడు.

తేలిపోయిన పసికూనలు​..

తొలుత బ్యాటింగ్​ చేసిన అఫ్గాన్​ జట్టు బ్యాట్స్​మెన్లు కివీస్​ పేస్​ దళానికి తలవంచారు. అఫ్గాన్​ను తక్కువ పరుగులకే కట్టడిచేయడంలో న్యూజిలాండ్​ బౌలర్లు విజయవంతమయ్యారు. బ్యాట్స్​మెన్లను పదునైన బంతులతో నీషమ్​, ఫెర్గుసన్​ బెంబేలెత్తించారు. ఫలితంగా 41.1 ఓవర్లలో 172 పరుగులకే సర్దేసింది అఫ్గాన్​ జట్టు. హష్మతుల్లా (59) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. నూర్ అలీ (34), హజ్రతుల్లా (31) రాణించారు.

కివీస్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లు, ఫెర్గుసన్​ 4 వికెట్లు, గ్రాండ్​హోమ్​ ఒక్క వికెట్​ తీశారు.

నీషమ్ విజృంభణ:

ఓపెనర్ హజ్రతుల్లా వికెట్​తో పాటు రెహ్మత్ షా, గుల్బాదిన్ నబీ, మొహమ్మద్ నబీ, నజీబుల్లా వికెట్లు తీసి అఫ్గాన్​ టాప్ ఆర్డర్​ను కుప్పకూల్చాడు నీషమ్​​. ఈ కివీస్​ బౌలర్ 10 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. నీషమ్​ బంతులకు అఫ్గాన్ బ్యాట్స్​మెన్ దగ్గర సమాధానం కరవైంది. ఈ ప్రపంచకప్​లో 5 వికెట్లు తీసిన రెండో బౌలర్​గా ఘనత'సాధించాడు నీషమ్. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నీషమ్​కే 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ అవార్డు దక్కింది.

RESTRICTIONS: Worldwide access. Maximum use 90 seconds. Use within 24 hours. No archive. No advertising or sponsorship may be placed "pre-roll", "post roll" or any manner near, before, during or after the clip in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the ICC event.
DIGITAL: No use on social channels. Can be used as a standalone clip worldwide excluding digital cricket channels which are not predominantly news portals, including but not limited to Cricinfo and Cricbuzz.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine programmes. A simultaneous transmission of the linear bulletin can be distributed by social channels such as YouTube and Facebook as long as the output is geoblocked and the other restrictions ar00:e adhered to.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cardiff Wales Stadium, Cardiff, Wales, UK. 8th June 2019.
England innings:
1. 00:00 Jonny Bairstow and Jason Roy walking to the middle
2. 00:03 Roy brings up his century with a boundary off Mustafizur Rahman, thanks to a misfield, before knocking over umpire Joel Wilson (off camera)
3. 00:10 Replay of Roy running into Wilson
4. 00:17 Roy hits the third of three successive sixes off Mehidy Hasan Miraz
5. 00:26 Roy out for 153, c - Mashrafe Mortaza b - Mehidy Hasan Miraz - 235 for 3
6. 00:37 Jos Buttler six off Mosaddek Hossain
Bangladesh innings:
7. 00:47 Soumya Sarkar out for 2, b - Jofra Archer - 8 for 1
8. 00:54 Replay
9. 01:00 Shakib Al Hasan six off Archer
10. 01:07 Shakib out for 121, b - Ben Stokes - 219 for 5
11. 01:15 Mohammad Saifuddin chops a Stokes delivery on to his stumps, but the bails remain in place
12. 01:19 Replay
13. 01:25 Mustafizur out for 0, c - Bairstow b - Archer - 280 all out
SOURCE: ICC
DURATION: 01:40
STORYLINE:
England completed a 106-run victory over Bangladesh in the Cricket World Cup on Saturday, with opening batsman Jason Roy putting on 153 runs as the tournament hosts finished on 386 for 6 before bowling out the opposition.
Last Updated : Jun 9, 2019, 11:59 PM IST

For All Latest Updates

TAGGED:

blackcaps
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.