అసలే ప్రత్యర్థి టీమిండియా... పైగా ప్రపంచకప్‌లో పాక్‌పై పరాజయమే ఎరుగని జట్టు... అందులోనూ ప్రస్తుత మెగాటోర్నీలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అదరగొడుతోన్న కోహ్లీసేన... మరి ఇంతటి దుర్బేధ్యమైన టీమిండియాను నిలువరించాలంటే మ్యాచ్‌లో ఏ చిన్న అవకాశం దొరికినా రెండు చేతులా అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో... ఒక్క క్యాచ్ చేజారినా అది మ్యాచ్ గతినే మార్చేస్తుంది. ఈ విషయం ఇటీవలే ఆసీస్ మ్యాచ్‌తో పాకిస్థాన్‌కు తెలిసొచ్చింది. బుధవారం ఫించ్ సేనతో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది పాక్. అందుకే ఆదివారం భారత్‌తో జరగబోయే మ్యాచ్‌కోసం ఈ తప్పిదాలను సరిదిద్దుకుని... తమ ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్.
" ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ మేం చాలా తప్పులు చేశాం. మా జట్టు ఫీల్డింగ్‌తో నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇది మా స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. ఫీల్డింగ్ తప్పిదాలపై ఎలాంటి మన్నింపులు ఉండవు. టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌కు ముందు ఫీల్డింగ్‌పై మరింత దృష్టి సారిస్తాం. "
- సర్ఫరాజ్ అహ్మద్, పాకిస్థాన్ కెప్టెన్
బుధవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సునాయాసంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. వ్యక్తిగత స్కోరు 33 వద్ద అస్ట్రేలియా సారథి ఆరోన్ ఫించ్ స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు ఆసిఫ్ అలీ. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఫించ్ మరో 49 పరుగులు జోడించి 82 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇదే మ్యాచ్‌లో ఆసిఫ్ చేతిలోనే బతికిపోయిన వార్నర్ ఏకంగా సెంచరీ బాదాడు. ఈ రెండు క్యాచ్‌లతో పాటు పాక్ ఫీల్డర్లు మరిన్ని తప్పిదాలు చేసినందున... అమిర్ అద్భుత బౌలింగ్ చేసినా... రియాజ్ చివర్లో మెరుపులు మెరిపించినా ఆ జట్టుకు పరాజయమే మిగిలింది.
ఇదీ చూడండి : 'ధావన్ బ్యాటింగ్‌కు ఓకే... కానీ ఫీల్డింగ్ కష్టమే'