దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు పలికాడు. డివిలియర్స్ చాలా నిజాయితీపరుడని, నిబద్దత కలిగిన వ్యక్తి అని ప్రశంసించాడు. అతడిపై విమర్శలు రావడం దురదృష్టమని డివిలియర్స్ ఇన్ స్టాలో రాసిన పోస్ట్‌కు సందేశం పంపాడు.
"సోదరా(డివిలియర్స్).. నాకు తెలిసినంత వరకు నీవు నిజాయితీపరుడివి, నిబద్దత కలిగిన వ్యక్తివి. నీకు అలా జరగడం దురదృష్టం. నీ వ్యక్తిగత విషయాల్లో వేరే వాళ్లు కలగ చేసుకోవడం విచారకరం. నేను, అనుష్క ఎప్పుడూ నీకు మద్దతుగానే ఉంటాం. నీ కుటుంబం నీకు అండగా ఉండాలని కోరుకుంటున్నా" -విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్
ప్రపంచకప్‌లో డివిలియర్స్ మళ్లీ పునరాగమం చేసేందుకు టీమ్ మేనేజ్మెంట్ను అడిగాడని వార్తలు వచ్చాయి. వీటిపై శుక్రవారం డివిలియర్స్ స్పందించాడు. జట్టులో చోటు కోసం ఎవరినీ డిమాండ్ చేయలేదని అతడు తన ఇన్ స్టాలో తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
డివిలియర్స్ నోట్లో ఏముందంటే..
"ప్రపంచకప్‌లో ప్రొటీస్ ప్రయాణం ముగిసింది. ఇప్పుడు వారి ఏకాగ్రతకు భంగం కలగదు కాబట్టి నేను మాట్లడతాను. నాపై అన్యాయంగా విమర్శలు చేశారు.
అసలు జరిగింది ఏంటంటే... ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించిన రోజు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును పర్సన్‌ల్‌గా ఒక్కడినే అడిగాను.. ప్రపంచకప్‌లో చోటు దొరుకుతుందా అని. అంతేకాని జట్టులో స్థానం కోసం నేను ఎవరినీ డిమాండ్ చేయలేదు. కుటుంబంతో ఆనందంగా గడిపేందుకే గత ఏడాది రిటైర్మెంట్ తీసుకున్నాను.
డూప్లెసిస్, నేను స్కూల్ నుంచి స్నేహితులం. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటనకు రెండు రోజుల ముందు ఫాఫ్‌తో సరదా చాట్ చేశాను. అందులో ఆ విషయం ప్రస్తావించాను.
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం తర్వాత నాపై అన్యాయంగా విమర్శలు చేశారు. అసలు జరిగిన విషయాన్ని మీడియా వక్రీకరించింది. నా వ్యక్తిగత సంభాషణను ఎవరో కావాలని వక్రీకరించి బయటకు విడుదల చేశారు.
ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నా. ఎంచుకున్న టీ 20 మ్యాచ్‌లే ఆడుతున్నా. ఎవరితోనూ నాకు విభేదాలు లేవు. ఇప్పటివరకు నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్విస్తున్నా. భవిష్యత్తులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు అవసరమైతే నా సహకారం అందిస్తా" అంటూ 4 పేజీల ప్రకటన విడుదల చేశాడు.
గత ఏడాది మే 23న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు డివిలియర్స్. దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ 20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. వేగవంతమైన అర్ధసెంచరీ, సెంచరీ, 150 పరుగులు చేసిన రికార్డు డివిలియర్స్ పేరు మీద ఉంది.
ఇది చదవండి: 'రఫాతో మ్యాచ్ అదుర్స్.. జకోతో కష్టమే'