న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ 13వ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 172 పరుగులకు ఆలౌటైంది. హష్మతుల్లా(59) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. నూర్ అలీ(34), హజ్రతుల్లా(31) రాణించారు. మిగతా అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... ఫెర్గ్యూసన్ 4 వికెట్లు పడగొట్టాడు. గ్రాండ్‌హోమ్ ఓ వికెట్ తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు హజ్రతుల్లా, నూర్ అలీ 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. హజ్రతుల్లాను ఔట్ చేసి ఈ జోడీని నీషమ్ విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే ఫేర్గ్యూసన్ బౌలింగ్‌లో నూర్ అలీ ఔటయ్యాడు. హష్మతుల్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. క్రీజులో పాతుకుపోయి జట్టుకు మంచి స్కోరును అందించాడు.
5 వికెట్లతో నీషమ్ విజృంభణ
-
Hazratullah Zazai 👆
— Cricket World Cup (@cricketworldcup) June 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Rahmat Shah 👆
Gulbadin Naib 👆
Mohammad Nabi 👆
Naijubullah Zadran 👆 @JimmyNeesh has been phenomenal today!
Follow live ▶️ https://t.co/Uv5e1IteWj#AFGvNZ#BACKTHEBLACKCAPS#AfghanAtalan pic.twitter.com/OMRU2lfCok
">Hazratullah Zazai 👆
— Cricket World Cup (@cricketworldcup) June 8, 2019
Rahmat Shah 👆
Gulbadin Naib 👆
Mohammad Nabi 👆
Naijubullah Zadran 👆 @JimmyNeesh has been phenomenal today!
Follow live ▶️ https://t.co/Uv5e1IteWj#AFGvNZ#BACKTHEBLACKCAPS#AfghanAtalan pic.twitter.com/OMRU2lfCokHazratullah Zazai 👆
— Cricket World Cup (@cricketworldcup) June 8, 2019
Rahmat Shah 👆
Gulbadin Naib 👆
Mohammad Nabi 👆
Naijubullah Zadran 👆 @JimmyNeesh has been phenomenal today!
Follow live ▶️ https://t.co/Uv5e1IteWj#AFGvNZ#BACKTHEBLACKCAPS#AfghanAtalan pic.twitter.com/OMRU2lfCok
ఓపెనర్ హజ్రతుల్లా వికెట్‌తో పాటు రెహ్మత్ షా, గుల్బాదిన్ నబీ, మొహమ్మద్ నబీ, నజీబుల్లా వికెట్లు తీసి అఫ్గాన్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు నీషమ్. కివీస్ బౌలర్ దెబ్బకు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. ప్రత్యర్థులకు తన పదునైన బౌలింగ్‌తో చెమటలు పట్టించాడు.
ఫెర్గ్యూసన్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. రషీద్ ఖాన్(0), అఫ్తాబ్(14) వికెట్లు తీశాడు. అప్గాన్ వికెట్ కీపర్ ఇక్రామ్(2) వికెట్ తీశాడు గ్రాండ్‌హోమ్ .
23వ ఓవర్ వద్ద వర్షం కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది అప్పటికే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది అఫ్గానిస్థాన్. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి శ్రమించారు.