ప్రపంచకప్ 2019 ఆరంభానికి ముందు 10 జట్ల కెప్టెన్లు బకింగ్ హామ్ ప్యాలెస్‌లో ఎలిజబెత్ రాణిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సారథులంతా ఫార్మల్ డ్రెస్సుల్లో రాగా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ సంప్రదాయ దుస్తుల్లో వెళ్లారు. అయితే ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు పాక్‌కు చెందిన ఓ రచయిత.
" అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాకిస్థానీ సారథి మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే! ".
-- పాక్ రచయిత, ట్వీట్
పాక్ సారథిపై రచయిత అవమానకర కామెంట్లు చేసినా... భారత అభిమానులు సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
'సర్ఫరాజ్‌ను విమర్శించడంలో అర్థంలేదు. నిజానికి కోహ్లి కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సింది. అయినా ఆటగాడి ప్రతిభను చూడాలి కాని అతడి వస్త్రధారణను కాదు. ఎలిజబెత్ రాణీగారు భారత్ వచ్చినపుడు చీర కట్టుకుంటారా. ప్రధాని మోదీని కలిసినపుడు విదేశీ నేతలు మనలా తయారవుతారా? బ్రిటన్ రాజును కలిసినపుడు గాంధీజీ ధోతి కట్టుకున్న విషయం మరచిపోయారా? అనవసరంగా అతడి మీద పడి ఏడవకండి'’ అంటూ భారత అభిమానులు ట్వీట్లు చేస్తూ పాక్ సారథికి అండగా నిలుస్తున్నారు.