ETV Bharat / sports

WC19: కప్​ వేటలో భారత్​ చివరి లీగ్​ మ్యాచ్​ - bumrah

ప్రపంచకప్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు లీడ్స్​ వేదికగా శ్రీలంకతో తలపడనుంది టీమిండియా. సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్న కోహ్లీ సేన... ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో విండీస్‌పై ఘన విజయం సాధించిన లంక... భారత్​పై గెలిచి ఈ ప్రపంచకప్‌కు వీడ్కోలు చెప్పాలని పట్టుదలతో ఉంది.

WC19: భారత్​కు టాప్​-1 దక్కేనా..?
author img

By

Published : Jul 6, 2019, 7:04 AM IST

ప్రాక్టీస్​లో భారత్​, శ్రీలంక ఆటగాళ్లు

విశ్వసమరంలో టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన భారత జట్టు నేడు లీడ్స్​ వేదికగా శ్రీలంకతో చివరి లీగ్​ మ్యాచ్​ ఆడనుంది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన భారత్‌ను... మిడిలార్డర్‌ సమస్య వేధిస్తోంది. శ్రీలంకతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లోనైనా ఈ సమస్యను అధిగమించాలని టీమిండియా భావిస్తుంది. మరోవైపు లంకేయులు విజయంతో టోర్నీకి ముగింపు పలకాలని చూస్తోంది.

భారత​ మి'డల్​'​ ఆర్డర్:

బ్యాటింగ్‌లో శుభారంభాలు దక్కుతున్నా భారీ స్కోరు సాధించడంలో విఫలం అవుతోంది కోహ్లీ సేన. కీలకమైన సెమీస్‌కు ముందు అన్ని విభాగాల్లో రాణించాలని కోరుకుంటుంది. మిడిలార్డర్‌లో ధోని ప్రదర్శన ఆందోళన పరుస్తుండగా... సెమీస్‌కు ముందు అతడు ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుకుంటుంది.

  1. రోహిత్‌శర్మ, రాహుల్‌, కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, భువనేశ్వర్‌ రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
  2. లంక పేస్​ బౌలింగ్​ను ఎలా ఎదుర్కొంటారనే దానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్​లో గెలిచి సెమీస్‌ పోరుకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది భారత్​.

లంక పరువు కోసం:

లంక జట్టు ఈ ప్రపంచకప్​లో రాణించినా వరుణుడు వల్ల ఆ జట్టు సెమీస్​ అవకాశాలు దెబ్బతిన్నాయి. 8 మ్యాచ్‌లాడిన లంక 3 మ్యాచ్‌ల్లో గెలిచి మరో మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాకిస్థాన్​, బంగ్లాదేశ్​తో ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఇప్పటికే సెమీస్‌ నుంచి నిష్క్రమించిన లంక చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది.

  1. లసిత్‌ మలింగ, ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... స్థిరత్వం లేకపోవడం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై చెలరేగిన లంక బ్యాట్స్‌మెన్‌ 338 పరుగుల భారీ స్కోరు సాధించారు.
  2. ఏంజెలో మాథ్యూస్‌, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండీస్‌ బ్యాట్‌తో అదరగొడుతున్నారు. మలింగా, ధనంజయ డిసిల్వా, ఉదాన బంతితో మెరిస్తే టీమిండియా​కు గట్టిపోటీ ఎదురవుతుంది.

అగ్రస్థానానికి అవకాశం..

నేడు జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయి... శ్రీలంకపై భారత్‌ గెలిస్తే కోహ్లీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి న్యూజిలాండ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో మాత్రమే ఓటమిపాలైన టీమిండియా... సెమీస్​లో ఆ జట్టును ఎదుర్కోదు.

జట్లు...

  • భారత్​: ఎడ్జ్​బాస్టన్​లో ఒక్క స్పిన్నర్​తోనే బరిలోకి దిగిన భారత జట్టు... ఈ మ్యాచ్​లోనూ అదే విధంగా బరిలోకి దిగే అవకాశముంది. ఇదే వ్యూహాం అనుసరిస్తే కుల్దీప్​కు మరోసారి చోటు దక్కదు.

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(సారథి), రిషభ్​ పంత్​, ధోనీ(కీపర్​), దినేశ్​ కార్తీక్​, హార్దిక్​ పాండ్య, షమీ, భువనేశ్వర్​ కుమార్​/కుల్దీప్​ యాదవ్​, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్​ బుమ్రా

  • శ్రీలంక:
    విండీస్​పై విజయం సాధించిన జట్టుతోనే లంకేయులు బరిలోకి దిగే అవకాశముంది.

కరుణారత్నే(సారథి), కుశాల్​ పెరీరా(కీపర్​), అవిష్క ఫెర్నాండో, కుశాల్​ మెండిస్​, మాథ్యూస్​, తిరుమన్నే, ఉదానా, డి సిల్వా, జెఫ్రే వాండర్సే, కసున్​ రజిత, లసిత్​ మలింగ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Pacaembu Stadium, Sao Paulo, Brazil. 5th July, 2019.
1. 00:00 Argentina players arriving to train
2. 00:09 Team running
3. 00:18 Wide of team training
4. 00:25 Various of team training
5. 01:01 Wide of team playing rondo
6. 01:08 Various of team playing rondo
7. 01:15 Lionel Messi
8. 01:26 Messi kicks the ball
SOURCE: SNTV
DURATION: 01:35
STORYLINE:
Argentina trained at the Pacaembu Stadium ahead of the 3rd place match of the Copa America on Saturday against Chile.
Lionel Messi's team were defeated by Brazil 2-0 at the Minerao Stadium on Tuesday (2nd July), ending any hopes for Messi to lift his first major title with Argentina.
Now the team will have to find strength to prepare for Saturday's third-place game against Chile, a repeat of the last two Copa America finals.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.