న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న కోహ్లీసేనకు ఊహించని దెబ్బ తగిలింది. ఇటీవలె చీలమండ గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన ఇషాంత్.. మళ్లీ అదే నొప్పితో జట్టుకు దూరం కానున్నాడు. తాజాగా గాయం తిరగబెట్టడం వల్ల ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. తుది జట్టు ప్రకటించే సమయానికి ఈ పేసర్ ఫిట్‌గా లేకపోతే ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. తొలి టెస్టులో బౌలర్లంతా విఫలమైనా.. ఇషాంత్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
పృథ్వీపై స్పష్టత
ఇటీవల కాలికి కట్టుతో కనిపించిన యువ ఓపెనర్ పృథ్వీషా.. రెండో టెస్టులో బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై కోచ్ రవిశాస్త్రి స్పష్టతిచ్చాడు. పృథ్వీ తుది జట్టులో ఉంటాడన్నాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లోనూ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కే అవకాశం లేదు.
ఇవీ చూడండి...
పిచ్ ఎక్కడుందో ఎవరైనా కనిపెట్టగలరా? : బీసీసీఐ