ETV Bharat / sports

WC19: పసికూనతో పోట్లాట తప్పదా...! - kohli

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాకు ఆతిథ్య ఇంగ్లాండ్​ అడ్డుకట్ట వేసింది. ఇప్పటికే దాదాపు సెమీస్​ బెర్త్​ ఖరారైనా.. ఓ విజయంతో స్థానాన్ని పక్కా చేసుకోవాలనుకుంటోంది మెన్​ ఇన్​ బ్లూ. నేడు బంగ్లాదేశ్​తో పోరుకు సిద్ధమవుతోన్న కోహ్లీ సేన... బలానికి మించి సత్తా చాటుతున్న ఆ పసికూనను నిలువరించగలదా..!

WC19: పసికూనతో పోట్లాట తప్పదా...!
author img

By

Published : Jul 2, 2019, 6:13 AM IST

మెగాటోర్నీలో లీగ్‌ మ్యాచ్‌లు ఆఖరి అంకానికి చేరుకొని రసవత్తరంగా తయారైతే... నాలుగో స్థానం కోసం ఇంకా.. జట్లు తలపడుతూనే ఉన్నాయి. మరి టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన టీమిండియా.. ఈరోజు బంగ్లాను ఓడించి సెమీస్​లో చోటు పదిలం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్​లో గెలిస్తే టాప్​ 4లో చేరేందుకు అవకాశాలు మరింత సులువవుతాయి. మరి అలాంటి కీలక పోరుకు రెడీ అవుతోన్న ఇరుజట్ల బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.

ప్రాక్టీసులో భారత్-బంగ్లా ఆటగాళ్లు

ప్రపంచకప్​లో సెమీఫైనల్​ బెర్తు కోసం కీలక పోరుకు సిద్ధమైంది భారత జట్టు​. మంగళవారం బర్మింగ్​హామ్​ వేదికగా బంగ్లాదేశ్​తో పోటీ పడనుంది. చావో రేవో తేల్చుకొనేందుకు బంగ్లా పులులు రెడీ అవుతున్నారు.

భారత్​ పరిస్థితేంటి...

ఈ మ్యాచ్​ గెలిస్తే 13 పాయింట్లతో నేరుగా సెమీస్​కు చేరుతుంది కోహ్లీసేన. ఓడితే శ్రీలంకతో చివరి మ్యాచ్​ కోసం ఎదురు చూడాలి. సెమీఫైనల్​ బెర్తులో ఏ స్థానం వస్తుందో తేల్చేది ఈ రెండు మ్యాచ్​లే కావడం వల్ల భారత్​ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

విరాట్​ అంతకుమించి...

ప్రపంచ నెం.1 బ్యాట్స్​మెన్​ విరాట్​ కోహ్లీ ఈ ప్రపంచకప్​లో వరుసగా 5 అర్ధశతకాలు చేసి మంచి ఫామ్​లో ఉన్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్​లు ఆడిన విరాట్​ ఒక్క శతకమూ చేయలేకపోయాడు. కాబట్టి అతడి నుంచి శతక ప్రదర్శన ఆశిస్తున్నారు అభిమానులు.

  • ఓపెనర్​ రోహిత్​ ఫామ్​లో ఉన్నా పరుగులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకొంటున్నాడు. మరో ఓపెనర్​ రాహుల్​ నుంచి సరైన మద్దతు లభించట్లేదు. వరుస శతకాలతో కీలక ఆటగాడిగా రోహిత్​ రాణించడం భారత్​కు కలిసివచ్చేదే. నాలుగో స్థానం కోసం యువ బ్యాట్స్​మెన్​ పంత్​కు మరో అవకాశం లభించనుంది.
  • మిడిలార్డర్​లో హార్దిక్​ పాండ్యా వేగంగా పరుగులు రాబడుతున్నాడు. ధోనీ అవసరమైన సమయంలోనూ బ్యాట్​ ఝుళిపించలేక సింగిల్స్​కు మాత్రమే పరిమితమవడం విమర్శలకు తావిస్తోంది.
  • బౌలర్లలో షమి, బుమ్రా అదరగొడుతున్నారు.

బంగ్లా​కు చోటుందా...!

బంగ్లాదేశ్​ సెమీస్​ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్​లో కచ్చితంగా నెగ్గాలి. చివరి మ్యాచ్​లో పాక్​పై విజయం సాధించాలి. అదే సమయంలో న్యూజిలాండ్​ చేతిలో ఇంగ్లాండ్​ ఓడిపోతే బంగ్లాకు సెమీస్​ బెర్తు లభిస్తుంది.

షకిబ్​ జోరుతో బేజారు..

ఆరు మ్యాచ్​ల్లో 476 పరుగులు చేసిన షకిబ్​ ఈ ప్రపంచకప్​ టాప్​ స్కోరర్​లో ఒకడిగా ఉన్నాడు. 2 శతకాలు, 3 అర్ధశతకాలు చేయడమే కాకుండా 10 వికెట్లు తీసి అద్భుతమైన ఆల్​రౌండర్​గా తనదైన ముద్ర వేసుకున్నాడు.

  • షకిబ్​కు మద్దతుగా తమీమ్​, ముష్ఫికర్ మంచి ఇన్నింగ్స్​ను నిర్మిస్తున్నారు.
  • ఓపెనర్​ సౌమ్య సర్కార్​ మంచి ఆరంభాన్నిస్తుండగా.. లిటన్​ దాస్​ హిట్టర్​గా రాణిస్తున్నాడు.
  • ముస్తాఫిజుర్​ రెహ్మాన్​, మోర్తజా బౌలింగ్​తో ఆకట్టుకుంటున్నారు.

ఆ చేదు జ్ఞాపకం...

2007 ప్రపంచకప్​...టైటిల్​ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు... బంగ్లా దెబ్బకు లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత 2011లో గ్రూప్​ దశలో ఆ జట్టును టీమిండియా చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకుంది. మరి ఈ ఏడాది ప్రపంచకప్​లో అంచనాలకు మించి వారెవ్వా అనిపించుకొంటున్న బంగ్లాను.. కోహ్లీ సేన తేలిగ్గా తీసుకుంటే అలాంటి ఫలితం పునరావృతమయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండి టీమిండియా సత్తా చాటాల్సిందే.

ఆదివారం ఇంగ్లాండ్​తో ఓడిపోయిన గడ్డపైనే టీమిండియా మ్యాచ్​కు సిద్ధమవుతోంది. ఇది బ్యాటింగ్​ పిచ్​. వర్షం పడే అవకాశం లేదు.

జట్లు...

  • భారత్​:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రిషభ్​ పంత్​, ధోనీ(కీపర్​), కేదార్ జాదవ్/ జడేజా​, హార్దిక్​ పాండ్య, షమి, కుల్దీప్​, చాహల్/భువనేశ్వర్​​, బుమ్రా

  • బంగ్లాదేశ్​:

తమీమ్​ ఇక్బాల్​, సౌమ్య సర్కార్​, షకిబ్, ముష్ఫికర్​ రహీమ్(కీపర్​​)​, లిటన్​ దాస్​, మహ్మదుల్లా/మిథున్​, మొసదిక్​ హుస్సేన్​, మొహ్మద్​ సైఫుద్ధీన్​, మెహిది హసన్​, మోర్తజా(కెప్టెన్​​), ముస్తాఫిజుర్​​ రెహ్మాన్​​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cenicientos - 1 July 2019
1. Various, including aerial shots, of helicopters dumping water on forest, smoke rising from trees
2. SOUNDBITE (Spanish) Carlos Novillo, Director, Madrid Emergencies:
"What we are doing is working inside the perimeter (of the fire) which has been strengthened. We are containing the spread of this fire that I have behind me. This is practically the only active front that we have at the moment in this fire."
3. Aerial of helicopter dumping water on fire
4. SOUNDBITE (Spanish) Carlos Novillo, Director, Madrid Emergencies:
"This is a protected area and an area where the Imperial Eagle, an endangered species and a species that is from the Iberian peninsula, nests. We are therefore working to protect the nest of this Imperial Eagle, it has two chicks, they are still two months away from being able to fly and they are in an area where they could be affected by the fire."
5. Various of firefighting helicopters filling up Bambi Buckets
6. Firefighting planes filling up with water at nearby reservoir
STORYLINE:
A wildfire in hills near Madrid was contained but still not extinguished Monday after burning for four straight days, authorities said.
More than 500 firefighters supported by 49 vehicles and 14 water-dropping aircraft attended the blaze some 60 kilometres (37 miles) west of the Spanish capital.
The aircraft were taking special care to avoid dumping water on the nest of an imperial eagle - a protected species - in the area, the Madrid region emergency services said.
Lower temperatures after a record-breaking heat wave in recent days and a weakening wind gave officials hope they might soon get an upper hand over the blaze, Madrid regional fire chief Agustín de la Herrán said.
However, temperatures in the area were still around 36 Celsius (97 Fahrenheit).
Police were investigating the cause of the fire.
Separately, a major wildfire in northeast Spain, which started on Wednesday, was brought under control late Sunday.
Wildfires this year charred more than 38,500 hectares (95,133 acres) of woodland up to June 23 - roughly three times more than in the same period last year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.