సౌతాంప్టన్ వేదికగా అఫ్గాన్‌తో పోరులో టీమిండియా బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న సారథి కోహ్లీ, ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ అర్ధశతకాలతో రాణించినా... పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిపడ్డారు. మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు నమోదవగా... ఒకే ఒక్క సిక్సర్ రావడం గమనార్హం. భారత బ్యాటింగ్ సమయంలో 45వ ఓవర్ అయిదో బంతికి కేదార్ ఆ ఒక్క సిక్స్ కొట్టకపోతే మరింత విమర్శలు మూటగట్టుకునేది టీమిండియా.
-
Match 28. 45.5: A Alam to K Jadhav (42), 6 runs, 204/5 https://t.co/8AQDgwqY6s #IndvAfg #CWC19
— BCCI (@BCCI) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Match 28. 45.5: A Alam to K Jadhav (42), 6 runs, 204/5 https://t.co/8AQDgwqY6s #IndvAfg #CWC19
— BCCI (@BCCI) June 22, 2019Match 28. 45.5: A Alam to K Jadhav (42), 6 runs, 204/5 https://t.co/8AQDgwqY6s #IndvAfg #CWC19
— BCCI (@BCCI) June 22, 2019
అంతేకాకుండా 2015 నుంచి ఇప్పటి వరకు మొదటి సారి బ్యాటింగ్ చేసి.. కోహ్లీ సేన ఇంత తక్కువ స్కోరు చేయడం ఇదే తొలిసారి.
ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు స్పిన్‌లో వికెట్ ఇవ్వని రికార్డును అఫ్గాన్ మ్యాచ్‌లో చెరిపేసుకుంది. అఫ్గాన్ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. పిచ్ స్పిన్‌కు అనుకూలించడాన్ని తెలివిగా ఉపయోగించుకుంది అఫ్గాన్ జట్టు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో అప్తాబ్ మినహా ఏ ఒక్క బౌలర్ 6 సగటుకు మించి పరుగులు ఇవ్వలేదు. 10 ఓవర్లు బౌలింగ్ వేసిన ముజీబ్ ఒక వికెట్ సహా అతి తక్కువగా 2.60 సగటుతో మాత్రమే రన్స్ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 10 ఓవర్లలో 110 పరుగులు సమర్పించుకొన్న రషీద్.. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.