ఇంగ్లండ్‌లోని వేల్స్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బయల్దేరిన భారత క్రికెట్ జట్టు బుధవారం సాయంత్రం లండన్‌లో అడుగుపెట్టింది. టీమిండియా అధికారిక దుస్తుల్లో దిగిన గ్రూప్ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఈ విషయం వెల్లడించింది బీసీసీఐ.
-
Touchdown London #TeamIndia pic.twitter.com/mWihuGrnjw
— BCCI (@BCCI) May 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Touchdown London #TeamIndia pic.twitter.com/mWihuGrnjw
— BCCI (@BCCI) May 22, 2019Touchdown London #TeamIndia pic.twitter.com/mWihuGrnjw
— BCCI (@BCCI) May 22, 2019
ఇంగ్లండ్, వేల్స్ సంయుక్త వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది భారత్. దానికంటే ముందు మే 25 నుంచి 28 వరకు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. ప్రయాణానికి ముందురోజు మీడియాతో మాట్లాడారు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి. అత్యంత సవాలుతో కూడిన ప్రపంచకప్ కాబట్టి ఉత్తమ ప్రదర్శన చేస్తామని కోహ్లీ వెల్లడించాడు.