తానైతే భారత జట్టులో రిషభ్‌పంత్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేస్తానని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ పరిస్థితులపై పంత్‌కు ఉన్న అవగాహనే ఇందుకు కారణమని తెలిపాడు.
"‘జట్టు యాజమాన్యంలో నా జోక్యం ఉంటే నాలుగో స్థానానికి రిషభ్‌పంత్‌ను పరిశీలిస్తా. ధావన్ గాయం కారణంగా వైదొలగటం వల్ల పంత్‌ను పిలిపించారు. ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. గత వేసవిలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పంత్ ఆకట్టుకున్నాడు. ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసు. టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. అతడి ప్రపంచకప్ అరంగేట్రానికి ఇదే మంచి తరుణం. మిడిలార్డర్‌లో విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఇంకా ఆకట్టుకోలేదు. వారి ఆటలో మార్పు అవసరం."
-కృష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా మాజీ క్రికెటర్
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అందిస్తున్న శుభారంభాల్ని తర్వాతి బ్యాట్స్‌మెన్ కొనసాగించాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు క్రిష్. ‘గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ మెరుపులు లేవని, రాహుల్ ఇంకా పరుగులు సాధించాలన్నాడు. విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడన్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షించాడు.
ఆస్ట్రేలియా జోరందుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడలేదనీ, పాక్ సరైన సమయంలో పుంజుకుందని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: టీమిండియా ఆరెంజ్ జెర్సీ ఇదే..