ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ సంగ్రామానికి వర్షాలు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు వర్షం దెబ్బకు రద్దయ్యాయి. ఆదివారం భారత్-ఆసీస్ మ్యాచ్‌కు తృటిలో వరుణ ప్రమాదం తప్పినా... గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు మాత్రం వాన పోరు తప్పేలా లేదు. నాటింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. లంచ్ విరామ సమయం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఇదే జరిగితే ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
- వాన కారణంగా జూన్ 10 సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్, జూన్ 7న బ్రిస్టల్ వేదికగా శ్రీలంక - పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఫలితం తేలని కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
ఎల్లో హెచ్చరిక..
రెండు రోజులుగా బ్రిటన్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. దాదాపుగా ఈ వారమంతా నాటింగ్‌హామ్ ప్రాంతంలో ఎల్లో హెచ్చరిక అమలులో ఉంది.
- కివీస్‌తో మ్యాచ్ వేదికైన నాటింగ్‌హామ్‌లో బుధవారం రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ రోజు లంచ్ సమయం వరకు తేలికపాటి జల్లులు కురవవచ్చని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్‌గా... కనిష్ఠ ఉష్ణోగ్రత 10 నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఇవీ చూడండి...